వరంగల్‌లో పవన్‌ సందడి | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో పవన్‌ సందడి

Jun 18 2026 1:05 AM | Updated on Jun 18 2026 1:05 AM

జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్న హనుమకొండ హనుమాన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన తన అభిమాని నిరంజన్‌ ఇంటికి బుధవారం సినీహీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వెళ్లారు. నిరంజన్‌ను పరామర్శించారు. ఆత్మీయంగా పలకరించి శాలువాతో సన్మానించారు. పవన్‌ వస్తున్నాడన్న సమాచారం మేరకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పరామర్శ అనంతరం ఆయన భద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారికి చీర, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేపూజలు నిర్వహించుకున్నారు.

– నయీంనగర్‌/హన్మకొండ కల్చరల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement