కేసముద్రం: ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. మండలంలోని కల్వల గ్రామానికి చెందిన కొట్టం ఆశ్విని ఇదే మండలం గాంధీనగర్‌జీపీలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా(ఎస్‌జీటీ) పనిచేస్తున్నారు. కాగా, ఉపాధ్యాయురాలు అశ్విని–వెంకటేశ్ దంపతులు తమ కుమారుడు ఇషాంత్(ఫస్ట్‌క్లాస్), కుమార్తె పూర్వజ(నర్సరీ)లను బుధవారం కల్వల ప్రాథమిక, ప్రీప్రైమరీ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కళ్లెం వీరారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో తన ఇద్దరు పిల్లలను చేర్పించిన ఉపాధ్యాయురాలు


