● కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్: నక్ష సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధి గుమ్ముడూర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న సర్వేను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పైలెట్ ప్రాజెక్టు కింద మానుకోట మున్సిపాలిటీని ఎంపిక చేశారన్నారు. మున్సిపల్ సిబ్బంది ఆర్‌ఓఆర్ పక్కాగా నమోదు చేయాలన్నారు. కేత్రస్థాయిలో పరిశీలన పూర్తి అయిన తర్వాత డ్రాఫ్ట్ తయారు చేసి అర్బన్ ప్రాపర్టీ కార్డ్ అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం.వినోద్ కుమార్, తహసీల్దార్ చంద్ర రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


