‘పల్స్‌పోలియో’ను సమర్థవంతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

‘పల్స్‌పోలియో’ను సమర్థవంతంగా నిర్వహించాలి

Jun 18 2026 12:59 AM | Updated on Jun 18 2026 12:59 AM

డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌

నెహ్రూసెంటర్‌: జిల్లాలో ఈ నెల 28 నుంచి 30 వరకు పల్స్‌పోలియో కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేయాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌ అన్నారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతంపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, ఉప కేంద్రాల వద్ద సకాలంలో వ్యాక్సిన్‌ పంపిణీ చేపట్టేలా సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైన వ్యాక్సిన్‌ పంపిణీ, కోల్డ్‌చైన్‌ నిర్వహణ, బూత్‌ల ఏర్పాటు, సిబ్బంది శిక్షణ, పర్యవేక్షణపై సమావేశంలో చర్చించారు. 0 నుంచి 5సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని, జిల్లాలో సుమారు 55 వేల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. సమావేశంలో మీడియా అధికారి రాజ్‌కుమార్‌, హెచ్‌ఈ పురుషోత్తం, వి.శ్రీనివాస్‌, కేఎల్‌ఎన్‌ స్వామి, ఎస్‌.శ్రీనివాస్‌, పి.లింగారెడ్డి, అనిల్‌, సత్యనారాయణ, ఫార్మసిస్టు రామారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement