పోటాపోటీ! | - | Sakshi
Sakshi News home page

పోటాపోటీ!

Jun 17 2026 5:03 AM | Updated on Jun 17 2026 5:03 AM

న్యూస్‌రీల్‌

మహబూబాబాద్‌
బుధవారం శ్రీ 17 శ్రీ జూన్‌ శ్రీ 2026

7

ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్‌ ఉద్యోగాలకు డిమాండ్‌

సాక్షి, మహబూబాబాద్‌: చిన్నదైనా.. పెద్దదైనా.. ప్రభుత్వ ఉద్యోగం కావాలంటారు. మహిళలకు అయితే స్కూల్‌ టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తల వంటి ఉద్యోగాలు అయితే బాగుంటాయని ఇష్టపడుతారు. ఈ కోవకు చెందిన ఉద్యోగాలే ప్రీ ప్రైమరీ పాఠశాల ఇన్‌స్ట్రక్టర్‌, ఆయాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలోని 18 మండలాల పరిధిలో మొత్తం 76 ప్రీప్రైమరీ పాఠశాలల్లో బోధకులు, ఆయాలకు పోటాపోటీగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులకు 1,188, ఆయా పోస్టులకు 428 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఉద్యోగం చిన్నదైతేనేం.. అని ఉన్నత చదువులు చదువుకున్న వారు కూడా దరఖాస్తులు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

కాన్వెంట్‌ స్కూళ్లకు దీటుగా..

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరిపితే పేద పిల్లలను ప్రైవేట్‌ స్కూల్‌కు పంపించరు. దీంతో తల్లిదండ్రులపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చనే ఆలోచనతో ప్రభుత్వం ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేసింది. పైగా ఈ విద్యార్థులకు కాన్వెంట్‌ స్కూల్స్‌కు తీసిపోకుండా బోధన జరపాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ విద్యా సంవత్సరంలో 76 పాఠశాలలకు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో బోధించేందుకు ఇన్‌స్ట్రక్టర్లు, వారికి సహాయకుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. అయితే ఊహించని విధంగా ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులకు 1,188, ఆయా పోస్టులకు 428 దరఖాస్తులు వచ్చాయి.

ఉన్నత విద్యావంతులు పోటీ..

ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్‌ ఉద్యోగానికి ఇంటర్‌, ఆయా ఉద్యోగానికి ఏడో తరగతి ఉత్తీర్ణులయితే చాలు. కానీ ఇన్‌స్ట్రక్టర్‌ ఉద్యోగానికి వచ్చిన దరకాస్తుల్లో ఇంటర్‌ పూర్తి చేసిన వారు 511, డిగ్రీ పూర్తి చేసిన వారు 433, పోస్టు గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసిన వారు 128, బీటెక్‌, పాలిటెక్నిక్‌ చదివిన వారు 14 మంది, స్థానికేతరులు 133 మంది ఉండడం గమనార్హం.

478

433

128

14

ఇంటర్‌ డిగ్రీ పీజీ

బీటెక్‌/పాలిటెక్నిక్‌

మొత్తం పోస్టులు = 76

మండలాల వారీగా వచ్చిన మొత్తం దరఖాస్తులు, విద్యార్హతలు ఇలా..

జిల్లాలో 76 బోధకుల పోస్టులకు 1,188, ఆయాలకు 428 దరఖాస్తులు

ఉన్నత చదువులు చదివిన వారే ఎక్కువ..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement