టీజీ టెట్‌ పరీక్షలు షురూ | - | Sakshi
Sakshi News home page

టీజీ టెట్‌ పరీక్షలు షురూ

Jun 17 2026 5:03 AM | Updated on Jun 17 2026 5:03 AM

విద్యారణ్యపురి: టీజీ టెట్‌–జూన్‌ 2026 (టీచర్‌ ఎలిజిబిలిటి టెస్ట్‌) హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నాలుగు ఆన్‌లైన్‌ బేస్డ్‌ టెస్ట్‌ సెంటర్లలో మంగళవారం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం సెషన్‌ 9 గంటల నుంచి 11:30 గంటల వరకు నిర్వహించిన పరీక్షలో 1,455 మంది అభ్యర్థులకుగాను 1,189 మంది (81.71శాతం) అభ్యర్థులు హాజరైనట్లు డీఈఓ ఎల్‌విగిరిరాజ్‌ గౌడ్‌ తెలిపారు. మధ్యాహ్నం రెండో సెషన్‌లో 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించగా.. 1,612 మంది అభ్యర్థులకుగాను 1,277 మంది (79.21 శాతం) హాజరయ్యారు. మొత్తం 14,227 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు డీఈఓ ఎల్‌విగిరిరాజ్‌ గౌడ్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement