తొర్రూరు రూరల్/దంతాలపల్లి: గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్‌వెస్లీ హెచ్చరించారు. మంగళవారం తొర్రూరు మండలంలోని గోపాలగిరి, అమ్మాపురం, దంతాలపల్లి మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామాల్లో డిప్యూటీ కమిషనర్ పర్యటించి, అభివృద్ధి పనులు, నర్సరీలు, ప్రభుత్వాల ద్వారా మంజూరు అవుతున్న నిధుల వినియోగం, పంచాయతీ సిబ్బంది పనితీరు వంటి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ పంచాయతీ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రతి పైసా వృథా చేయకుండా కలిసిమెలసి పని చేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ హరిప్రసాద్, డీఎల్‌పీఓ పుల్లారావు, సర్పంచ్‌లు కారుపోతుల సాయిదుర్గా, యనమాల సావిత్రి, ముద్దం సునీత, ఉప సర్పంచ్‌లు దర్మారపు మధు, సిరిపాటి విశాల్, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్‌వెస్లీ


