విష పురుగు కాటుతో చిన్నారి మృతి | - | Sakshi
Sakshi News home page

విష పురుగు కాటుతో చిన్నారి మృతి

Jun 17 2026 12:52 AM | Updated on Jun 17 2026 12:52 AM

నారాయణపురంలో ఘటన

బచ్చన్నపేట : విష పురుగు కాటు వేయడంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం జనగా మ జిల్లా బచ్చన్నపేట మండలం నారాయణపురంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఒగ్గు మమత, మహేశ్‌ దంపతలకు కుమారుడు, కూతురు సంతానం. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంటి ఆవరణలో తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న చిన్నారి మధుస్మిత (09)ను విషపురుగు కాటేసింది. వెంటనే తల్లిదండ్రులకు తెలుపడంతో వెంటనే జనగామ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందింది. కాగా, మధుస్మిత మండల కేంద్రంలోని బిషప్‌ తుమ్మబాల పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement