డోర్నకల్‌–గుండ్రాతిమడుగు మధ్య రైల్వే బ్లాక్‌ | - | Sakshi
Sakshi News home page

డోర్నకల్‌–గుండ్రాతిమడుగు మధ్య రైల్వే బ్లాక్‌

Jun 17 2026 12:52 AM | Updated on Jun 17 2026 12:52 AM

కాజీపేట రూరల్‌ : కాజీపేట జంక్షన్‌–కొండపల్లి రూట్‌లో డోర్నకల్‌–గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ల మధ్య థర్డ్‌లైన్‌ ట్రిప్లింగ్‌ వర్క్స్‌ నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ వర్క్స్‌ కారణంగా ఆగస్టు 15 నుంచి 19వ తేదీ వరకు పలు ప్యాసింజర్‌ రైళ్లను రద్దు, దూరం కుదింపు, దారి మళ్లించి నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ తెలిపారు.

రద్దయిన రైళ్లు..

ఆగస్టు 15 నుంచి 19వ తేదీ వరకు కాజీపేట–డోర్నకల్‌ (67765) డైలీ ప్యాసింజర్‌ , డోర్నకల్‌–కాజీపేట (67766) డైలీ ప్యాసింజర్‌, డోర్నకల్‌–విజయవాడ (67767) డైలీ ప్యాసింజర్‌, విజయవాడ–డోర్నకల్‌ (67768) డైలీ ప్యాసింజర్‌, విజయవాడ– భద్రాచలం(67215) డైలీ ప్యాసింజర్‌, భద్రాచలం–విజయవాడ (67216) డైలీ ప్యాసింజర్‌, విజయవాడ–సికింద్రాబాద్‌ (12713) డైలీ ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌–విజయవాడ (12714) ఎక్స్‌ప్రెస్‌,

ఆగస్టు 19వ తేదీన..

గుంటూరు–సికింద్రాబాద్‌ (12705) ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌–గుంటూరు (12706) ఎక్స్‌ప్రెస్‌, ఆగస్టు 17,18న సికింద్రాబాద్‌–భద్రాచలం (17659), సికింద్రాబాద్‌–మణుగూరు (12745) ఎక్స్‌ప్రెస్‌, ఆగస్టు 18,19న భద్రాచలం–సికింద్రాబాద్‌ (17660) ఎక్స్‌ప్రెస్‌, మణుగూరు–సికింద్రాబాద్‌ (12746) ఎక్స్‌ప్రెస్‌, ఆగస్టు 16,17,18న విశాఖపట్నం–మహబూబ్‌నగర్‌(12861) ఎక్స్‌ప్రెస్‌, ఆగస్టు 17,18,19న మహబూబ్‌నగర్‌–విశాఖపట్నం (12862) ఎక్స్‌ప్రెస్‌, ఆగస్టు 16,17,18న కాకినాడ టౌన్‌–లింగంపల్లి (12775) ఎక్స్‌ప్రెస్‌, ఆగస్టు 17,18,19న లింగంపల్లి–కాకినాడ టౌన్‌ (12776) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు.

దూరం కుదింపు..

ఆగస్టు 15 నుంచి 19వ తేదీ వరకు గుంటూరు–సికింద్రాబాద్‌ (17201) ఎక్స్‌ప్రెస్‌ను గుంటూరు–కాజీపేట మధ్య రద్దు, సికింద్రాబాద్‌–గుంటూరు (17202) ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట–గుంటూరు మధ్య రద్దు చేశారు. ఆగస్టు 16 నుంచి 19వ తేదీ వరకు భద్రాచలం–బల్లార్షా (17033) ప్యాసింజర్‌ భద్రాచలం–వరంగల్‌ మధ్య రద్దు, ఆగస్టు 15 నుంచి 18వ తేదీ వరకు సిర్పూర్‌టౌన్‌–భద్రాచలం (17034) సింగరేణి వరంగల్‌–భద్రాచలం మధ్య రద్దు చేశారు.

దారి మళ్లించిన రైళ్లు..

ఆగస్టు 14 నుంచి 18 వరకు విశాఖపట్నం–ఎల్‌టీటీ ముంబాయి (18519), ఎల్‌టీటీ ముంబాయి–విశాఖపట్నం (18520) ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌కు కాజీపేటలో హాల్టింగ్‌ తొలగించి వయా విజయవాడ, పగిడిపల్లి, సికింద్రాబాద్‌ మీదుగా దారి మళ్లించారు. ఆగస్టు 17,18న సీఎస్‌టీ ముంబాయి–భువనేశ్వర్‌ (11019), భువనేశ్వర్‌–సీఎస్‌టీ ముంబాయి (11020) కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లకు కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, మధిరలో హాల్టింగ్‌ ఎత్తివేసి వయా విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి, సికింద్రాబాద్‌ మీదుగా దారి మళ్లించారు. ఆగస్టు 18న మచిలీపట్నం–సాయినగర్‌ షిర్డీ (17208), సాయినగర్‌ షిర్డీ–కాకినాడ పోర్టు (17205) ఎక్స్‌ప్రెస్‌లకు కాజీపేట, వరంగల్‌, కేసముద్రం, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిరలో హాల్టింగ్‌ ఎత్తివేసి వయా విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి, సికింద్రాబాద్‌ మీదుగా దారి మళ్లించారు. ఆగస్టు 18,19న చర్లపల్లి–షాలిమార్‌ (18046) ఎక్స్‌ప్రెస్‌ను భువనగిరి, ఆలేరు, జనగామ, కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌లో హాల్టింగ్‌ ఎత్తివేసి వయా చర్లపల్లి, పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా దారి మళ్లించారు.

10 రీషెడ్యూలింగ్‌ ట్రైన్స్‌..

ఆగస్టు 8 నుంచి 15,17,19న విశాఖపట్నం–సికింద్రాబాద్‌ (20833) ఎక్స్‌ప్రెస్‌ గంట, ిసికింద్రాబాద్‌–విశాఖపట్నం (20834) ఎక్స్‌ప్రెస్‌ గంట, ఆదిలాబాద్‌–తిరుపతి (17406) కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ 75 నిమిషాలు, ఆగస్టు 17న తిరుపతి–హిసర్‌ (04718) ఎక్స్‌ప్రెస్‌ 75 నిమిషాలు, ఆగస్టు 16న న్యూఢిల్లీ–చెన్నయ్‌సెంట్రల్‌ (12622) తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ 75 నిమిషాలు, ఆగస్టు 17న హైదరాబాద్‌–విశాఖపట్నం (12728) గోదావరి ఎక్స్‌ప్రెస్‌ 75 నిమిషాలు, ఆగస్టు 17న హైదరాబాద్‌–తాంబురం (12764) చార్మినార్‌ గంట, సికింద్రాబాద్‌–తిరుపతి (12764) పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ గంట, బనారస్‌–రామేశ్వరం (22536) ఎక్స్‌ప్రెస్‌, రామేశ్వరం–అయోధ్య( 22613) ఎక్స్‌ప్రెస్‌ గంట పాటు రీషెడ్యూలింగ్‌ చేసినట్లు సీపీఆర్వో తెలిపారు.

కాజీపేట జంక్షన్‌–కొండపల్లి రూట్‌లో ఆగస్టు 15 నుంచి 18 రైళ్లు రద్దు

4 రైళ్లు దూరం కుదింపు..

7 రైళ్ల దారి మళ్లింపు

వరంగల్‌, కాజీపేట మీదుగా వెళ్లే

10 రైళ్లు రీషెడ్యూలింగ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement