ఆదివాసీలను వెనక్కి పంపాలి | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీలను వెనక్కి పంపాలి

Jun 17 2026 12:52 AM | Updated on Jun 17 2026 12:52 AM

ఇతర

ప్రాంతాల

ఏటూరునాగారం : మండలం కేంద్రంలోని 209 సర్వే నంబర్‌లో గల చెరువు శిఖం భూమిని ఇతర ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు కబ్జా చేస్తున్నారని ఏటూరునాగారం గిరిజనేతరులు చేపట్టిన శాంతియుత నిరసన, ధర్నా, బంద్‌ విజయవంతమైంది. మంగళవారం ఓడవాడ హనుమాన్‌ గుడి నుంచి వైజంక్షన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న ఏఎస్పీ మనన్‌ భట్‌, సీఐ శ్రీనివాస్‌, ఐదు మండలాల ఎస్సైలు, కానిస్టేబుళ్లు పెద్ద ఎత్తున హాజరై బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు, జేఏసీ నాయకులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన 30 మంది రైతులు 1965 నుంచి సాగు చేసుకుంటూ కాస్తులో ఉన్నారని, వారి భూముల్లో మిగతా మండలాల నుంచి వచ్చిన ఆదివాసీలు గుడిసెలు వేయడం ఏమిటని ప్రశ్నించారు. బడే సులోచన, శమంతకమణి, గొంది గౌరమ్మ, బొల్లం సారయ్యతోపాటు మరికొంత మంది కబ్జాకు పాల్పడి ఇతర మండలాల నుంచి ఆదివాసీలను రప్పించి కర్రలు పాతుతున్నారని ఆరోపించారు. దీనిపై అక్రమణదారులను వెనకకు పంపాలని కోరారు. సమాచారం అందుకున్న తహసీల్దార్‌ జగదీశ్‌ ఘటనాస్థలికి చేరుకుని మాట్లాడారు. సర్వే నంబర్‌ 209లోని 125 ఎకరాల చెరువు శిఖం భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని, ఎవరికీ పట్టాలు ఇవ్వలేదని, అక్కడ ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. దీనిపై శాంతించిన ప్రజలు రెండు రోజుల సమయం ఇస్తామని, స్థానికేతరులను పొలాల నుంచి ఖాళీ చేయించాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఘర్షణ చోటు చేసుకోకుండా

163, 164 సెక్షన్‌ అమలు

ఆకులవారిఘణపురంలోని సర్వే నంబర్‌ 209లో గల చెరువు శిఖం భూములో ఇతర ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు, స్థానిక గిరిజనేతరులకు కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయని, దీనివల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఇరువర్గాలకు నోటీసులు జారీ చేసినట్లు తహసీల్దార్‌ జగదీశ్‌ తెలిపారు. గొడవలకు దిగకుండా 163, 164 సెక్షన్లు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసుకున్న వారిని పంపిస్తామన్నారు.

ఏటూరునాగారం గిరిజనేతరుల డిమాండ్‌

శాంతియుత నిరసన,

ర్యాలీ విజయవంతం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement