బిల్లులు చెల్లించడం లేదని.. | - | Sakshi
Sakshi News home page

బిల్లులు చెల్లించడం లేదని..

Jun 17 2026 12:52 AM | Updated on Jun 17 2026 12:52 AM

పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్‌

కురవి: మహబూబాబాద్‌ జిల్లా సీరోలు మండలం కాంపల్లి శివారు బీల్యానాయక్‌ తండా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు మంగళవారం కాంట్రాక్టర్‌ తాళం వేశాడు. వివరాలిలా ఉన్నాయి. మన ఊరు–మన బడి పథకం కింద మంజూరైన నిధులతో తండాలోని ప్రాథమిక పాఠశాలలో కాంట్రాక్టర్‌ బానోత్‌ శ్రీనివాస్‌ పలు అభివృద్ధి పనులు చేశాడు. అయితే చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టర్‌ పాఠశాల ప్రారంభమైన రెండో రోజు పాఠశాలకు తాళం వేశాడు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు వరండాలో కూర్చున్నారు. ఈ విషయాన్ని హెచ్‌ఎం వీరన్న.. ఎంఈఓ ఇస్లావత్‌ లచ్చిరాంనాయక్‌కు తెలిపారు. దీంతో ఎంఈఓ లచ్చిరాం ఫోన్‌ చేయడంతో కాంట్రాక్టర్‌ శ్రీనివాస్‌ పాఠశాలకు వచ్చాడు. ఆయనతో చర్చించి తాళం తీయించడంతో తరగతులు యథావిధిగా కొనసాగాయి.

ఎంఈఓతో చర్చలు సఫలం

అనంతరం లాక్‌ తీసిన శ్రీనివాస్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement