మహబూబాబాద్: వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలనికలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం వన మహోత్సవం యాక్షన్‌ప్లాన్‌పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వన మహోత్సవాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. ఈనెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నర్సరీల్లో డిమాండ్‌కు అనుగుణంగా మొక్కలు పెంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మంకీ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా యాక్షన్‌ప్లాన్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు అనిల్‌కుమార్, పురుషోత్తం పాల్గొన్నారు.


