కొనుగోల్‌ పూర్తి | - | Sakshi
Sakshi News home page

కొనుగోల్‌ పూర్తి

Jun 16 2026 1:16 AM | Updated on Jun 16 2026 1:16 AM

ట్రాన్స్‌పోర్ట్‌ కిరాయి డబ్బులు

రూ.లల్లో ఇలా (టన్నుకు)

చెల్లించే డబ్బులు

దూరం(కిలో మీటర్లు)

సాక్షి, మహబూబాబాద్‌ : జిల్లాలో ప్రతీ సంవత్సరం ఒడిదొడుకులు, ఇబ్బందులు, గొడవలు, రైతుల ధర్నాలు, ఆందోళనల మధ్య కొనసాగిన ధాన్యం కొనుగోళ్లు.. ఈ ఏడాది యాసంగిలో కొన్ని సంఘటనల మినహా ప్రశాంతంగా పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అంచనాలకు మించి ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా.. ప్రక్రియ అంతా 50రోజుల్లోనే పూర్తి చేశారని, సమష్టి కృషితోనే సాధ్యమైందని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అధికారులకు అభినందలను తెలిపినట్లు తెలిసింది. అయితే కొనుగోళ్లు సాఫీగా ముందుకు సాగడానికి, కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించేందుకు దోహదపడిన ట్రాక్టర్ల కిరాయి విషయంపై జిల్లాలో చర్చ జరుగుతోంది.

అంచనాలకు మించి..

యాసంగిలో 1,71,780 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందుకుగాను రైతుల అవసరాలు, ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్మకాలు పోగా 2,60,762 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు అంచనా వేశారు. అయితే మెలిమి బియ్యం ఇచ్చే సన్న రకాలు, ఆర్‌ఎన్‌ఆర్‌ వంటి రకాలకు మిల్లర్లు కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో అందజేసే ధరకు మించి పచ్చి ధాన్యం కొనుగోలు చేశారు. దీంతో 1.70లక్ష మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేస్తామని భావించారు. అయితే ఏప్రిల్‌ మూడో వారంలో కొనుగోళ్లు ప్రారంభించి జూన్‌ మొదటి వారంలోపే పూర్తి చేశారు. మొత్తం 50 రోజుల్లో 211 కొనుగోలు కేంద్రాల ద్వారా 26,645 మంది రైతుల నుంచి రూ. 448,27,89,823 విలువచేసే 1,88,003 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. గత ఏడాది యాసంగిలో 1,77,610 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా.. ఈ ఏడాది యాసంగిలో 10,393 మెట్రిక్‌ టన్నులు అదనంగా సేకరించారు.

ట్రాక్టర్ల కిరాయి కోసం..

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంలో రైతుల ట్రాక్టర్లే కీలక పాత్ర పోషించాయి. జిల్లాలోని గతంలో ఎగుమతికోసం సకాలంలో లారీలు రాలేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది అదనంగా మరో రెండు రూట్లు పెంచి మొత్తం ఏడు ట్రాన్స్‌పోర్ట్‌ రూట్లు పెట్టారు. అయితే కాంట్రాక్టర్లు సకాలంలో లారీలను సరఫరా చేయలేకపోవడం, దిగుమతి ఇబ్బందులతో లారీల కొరత ఏర్పడింది. దీంతో కల్లాల్లో కాంటాలు పెట్టిన ధాన్యం అక్కడే కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. దీనిని గమనించిన కలెక్టర్‌ మిల్లులే కాకుండా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దిగుమతి చేసేలా ఏర్పాట్లు చేశారు. లారీలు రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా రైతుల వద్ద నుంచి 554 ట్రాక్టర్లను తీసుకువచ్చి ధాన్యం తరలించారు. అయితే గతంలో రైతులు ట్రాక్టర్లు పెట్టి మిల్లులకు తరలించిన ధాన్యం తాలూకు డబ్బులు రైతులకు ఇవ్వలేదనే ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా పీఏసీఎస్‌ సెంటర్లలో పలువురు రైతుల డబ్బులు కాజేశారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మొత్తం రూ.10కోట్ల మేరకు ట్రాన్స్‌పోర్ట్‌ కిరాయిలు వస్తే ఇందులో రూ. 2కోట్ల మేరకు రైతులు పెట్టిన ట్రాక్టర్లకు ఇవ్వాలి. ఈ యాసంగిలో కూడా అందరికన్నా పీఏసీఎస్‌ ఆధ్వర్యంలోనే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి రైతులు పెట్టిన ట్రాక్టర్లకు కిరాయి డబ్బులు ఇప్పించాలని, ఇందుకోసం రైతుల ట్రక్‌షీట్లను తీసుకొని నేరుగా డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారు.

అందరి సహకారంతోనే

కొనుగోళ్లు పూర్తి

యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రారంభంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిని గమనించిన కలెక్టర్‌ ఆదేశాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఎగుమతి ఇబ్బందులు తొలగించేందుకు ట్రాక్టర్లను పెట్టాం. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు, ప్రధానంగా రైతుల మద్దతుతో కొనుగోళ్లు సవ్యంగా జరిగాయి. ట్రాక్టర్‌ పెట్టిన ప్రతీ రైతుకు కిరాయి డబ్బులు అందించేలా చర్యలు తీసుకుంటాం.

– అనిల్‌ కుమార్‌, అదనపు కలెక్టర్‌(రెవెన్యూ)

403.13

392.83

397.99

386.91

380.98

41–80

0–8

9–20

21–40

జిల్లాలో లక్ష్యానికి మించి ధాన్యం సేకరణ

50 రోజుల్లోనే ప్రక్రియ కంప్లీట్‌

అధికారులను అభినందించిన కలెక్టర్‌

ట్రాన్స్‌పోర్ట్‌ కిరాయిల కోసం రైతుల ఎదురుచూపులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement