న్యూస్‌రీల్
ముగ్గురు పిల్లల నుంచి 60 మంది వరకు..
నెల్లికుదురు: ముగ్గురు పిల్లలతో మూతపడే దశకు చేరిన మండలంలోని సీతారాంపురం ప్రాథమికో న్నత పాఠశాల రెండేళ్లలో 60 మందితో కళకళలాడుతోందని హెచ్‌ఎం ఉప్పలయ్య అన్నారు. మొదటిరోజు సోమవారం పాఠశాలను మామిడి తోరణాలు, అరటి మట్టలతో అందంగా అలంకరించి పిల్లలకు స్వాగతం పలికినట్లు తెలిపారు. మొదటి రోజు 25 మంది పిల్లలు పాఠశాలకు రావడం అభినందనీయమన్నారు. సర్పంచ్ భాస్కర్ నాయక్ తన కుమారుడు హరినాయక్‌కు మూడో తరగతిలో అడ్మిషన్ తీసుకున్నట్లు హెచ్‌ఎం తెలిపారు.


