● తొర్రూరు ఆర్డీఓ గణేష్
● 17 వినతుల స్వీకరణ
తొర్రూరు: ప్రజావాణి అర్జీలు పెండింగ్‌లో పెట్టవద్దని తొర్రూరు ఆర్డీఓ జి.గణేష్ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. స్థానికుల నుంచి 17 దరఖాస్తులు అందాయి. దానిలో 12 భూ సంబంధిత, 5 పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. ఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రతీ వినతిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధిష్ట కాలపరిమితిలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేసి దరఖాస్తుదారులకు రశీదులు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ పుల్లారావు, ఏఎల్‌ఓ రవి, ఆర్డీఓ కార్యాలయ ఏఓ అనిల్‌కుమార్, ఎకై ్సజ్ ఎస్సై శంకర్, సీడీపీఓ రేష్మ, వైద్యాధికారి ప్రియాంక, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.


