వర్షపు నీటితో నిండిన అండర్‌బ్రిడ్జి | - | Sakshi
Sakshi News home page

వర్షపు నీటితో నిండిన అండర్‌బ్రిడ్జి

Jun 15 2026 4:10 AM | Updated on Jun 15 2026 4:10 AM

నెహ్రూసెంటర్‌: మహబూబాబాద్‌ పట్టణంలో రైల్వే అండర్‌బ్రిడ్జి కొద్దిపాటి వర్షానికే నీటితో నిండిపోవడంతో చెరువును తలపిస్తోంది. ఆదివారం గంటపాటు కురిసిన వర్షంతో నీరు అండర్‌బ్రిడ్జిలోకి చేరి రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణంలోని కొత్త బజారు, పాత బజారును అనుసంధానం చేసేలా ఏర్పాటు చేసిన బ్రిడ్జి ఏటా వర్షాకాలంలో వర్షపు నీటితో నిండిపోతుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వాహనదారులు, పాదచారులు పాత బజారు నుంచి కొత్త బజారుకు పట్టణ శివారు ప్రాంతాల నుంచి వెళ్లాల్సి వస్తోంది. ప్రతీ వానాకాలం ఇదే పరిస్థితి నెలకొంటుందని, అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.

అండర్‌బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే..

వర్షం వల్ల అండర్‌బ్రిడ్జిలో నీరు నిలిచిపోవడంతో రాకపోకలు బంద్‌ అయ్యాయి. ఈ క్రమంలో మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ అండర్‌బ్రిడ్జిని పరిశీలించారు. ప్రజల రాకపోకలు కొనసాగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుగులోత్‌ జ్యోతిరమేష్‌, 33వ వార్డు కౌన్సిలర్‌ బి.అజయ్‌సారథిరెడ్డి, 19వ వార్డు కౌన్సిలర్‌ చిదిరాల అరుణజ్ఞానేశ్వర్‌, అధికారులు తదితరులు ఉన్నారు.

కొత్త బజారు, పాతబజారుకు

నిలిచిపోయిన రాకపోకలు

పరిశీలించిన ఎమ్మెల్యే, అధికారులు, కౌన్సిలర్లు

ఏటా వర్షాకాలం ఇబ్బందులు

పడుతున్న ప్రజలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement