భద్రతపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

భద్రతపై ప్రత్యేక దృష్టి

Jun 15 2026 4:10 AM | Updated on Jun 15 2026 4:10 AM

డోర్నకల్‌: రైల్వే ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌(పీసీఎస్‌సీ) అరోమాసింగ్‌ ఠాగూర్‌ తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్‌తో పాటు ఆర్‌పీఎస్‌ స్టేషన్‌, పలు ప్లాట్‌ఫారాలను శనివారం అర్ధరాత్రి తనిఖీ చేశారు. ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫారంపై నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్‌పీఎఫ్‌ స్టేషన్‌ను పరిశీలించి రికార్డులను తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం నాలుగు ప్లాట్‌ఫారాలను, మూడో లైన్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. రైల్వే స్టేషన్‌ పరిసరాలను తనిఖీ చేసి భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్థానిక సిబ్బందితో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్లలో మహిళలు, వృద్ధులు, పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. రైల్వే ఆస్తుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్‌ డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ నవీన్‌, ఆర్‌పీఎఫ్‌ సీఐ సురేష్‌గౌడ్‌, ఎస్సై యాసీన్‌బేగం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement