జనగామలో గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

జనగామలో గంజాయి పట్టివేత

Jun 15 2026 4:10 AM | Updated on Jun 15 2026 4:10 AM

జనగామ : మాదక ద్రవ్యాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఆదివారం జనగామలో నిర్వహించిన తనిఖీల్లో 2.9 కిలోల గంజాయి పట్టుకుని ముగ్గురు యువకులను అరెస్ట్‌ చేసినట్లు సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. ఎస్సై రతీశ్‌, కానిస్టేబుళ్లు సాగర్‌, రమేశ్‌, నరేశ్‌, ప్రణయ్‌, మహేందర్‌ ఆర్టీసీ బస్టాండ్‌, చౌరస్తా తదితర ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఆర్టీసీ బస్టాండ్‌ పరిసర ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన ముగ్గురు యవకులు మిసాల శ్యామ్‌, కాశిబోయిన గౌతమ్‌, గుండా కార్తీక్‌ను ప్రశ్నించడంతో పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేయగా సుమారు 2.9 కిలోల గంజాయి లభించింది. దీంతో సరుకు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ తెలిపారు.

ముగ్గురి యువకుల అరెస్ట్‌

2.9కిలోల సరుకు స్వాధీనం

వివరాలు వెల్లడించిన పోలీసులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement