● తెలుగు ఉభయ రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షుడు మల్లేశం
● ముగిసిన జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు
హన్మకొండ కల్చరల్: కళాకారులకు ఎల్లప్పుడు అండగా ఉంటామని తెలుగు ఉభయ రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షుడు, కేంద్రఖాదీ చిన్న పరిశ్రమల శాఖ పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన 17వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ మేరకు ఐక్యవేదిక అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఈగ మల్లేశం, విశిష్ట అతిథులుగా గట్టు మహేశ్‌బాబు, నాటక సమాజాల రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల సదానందం, సీనియర్ రంగస్థల కళాకారులు బిటవరం శ్రీధరాస్వామి, బిటవరం శ్రీనాఽథ్ హాజరై జ్యోతిప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈగ మల్లేశం మాట్లాడుతూ రంగస్థల కళాకా రుల ఐక్యవేదిక తరఫున అనేక సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధ్యక్షుడు డాక్టర్ కాజీపేట తిరుమలయ్య, కార్యవర్గాన్ని అభినందించారు. అనంతరం వెంపటి శ్రావణి శిష్యబృందం చేసిన శాసీ్త్రయ నృత్యాలు, మిమిక్రీ ప్రదర్శనలు అలరించాయి. ఎన్‌ఎస్‌ఆర్ మూర్తి, జేఎన్ శర్మ, ఆకుతోట లక్ష్మణ్, సాధుల సురేశ్, కుసుమ సుధాకర్, జూలూరు నాగరాజు, కుడికాల జనార్దన్, సీత వెంటేశ్వర్లు, మాలి విజయ్‌రాజ్, సంజయ్‌బాబు, మట్టెవాడ అజయ్, నేరెళ్ల శోభావతి, తదితరులు పాల్గొన్నారు.
‘సూపర్’లో డిప్యూటీ సూపరింటెండెంట్ బదిలీ
● ఇక ఆర్‌ఎంఓపై ఆస్పత్రి భారం
కాశిబుగ్గ: వరంగల్ కేఎంసీలోని సూపర్ స్పెషా లిటీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు చూ సుకునే డిప్యూటీ సూపరింటెండెంట్ అనిల్ బా లరాజు ఇటీవల బదిలీ అయ్యారు. దీంతో ఆ స్పత్రి నిర్వహణ అంతా ఏకై క ఆర్‌ఎంఓ ప్రతా ప్‌పై పడింది. ఇప్పటికే ఔట్ సోర్సింగ్‌పై ఆధారపడి నడుస్తున్న సూపర్ ఇక సమస్యలమయంగా మారనుంది.
ఎంజీఎంలో బిగ్‌బాస్ పోస్టు భర్తీ
అయితేనే డిప్యూటీకీ మార్గం..
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో బిగ్‌బాస్ (సూపరింటెండెంట్) పోస్టు వారం దాటినా భర్తీ కా వడం లేదు. ఇక్కడ కూడా ఆర్‌ఎంఓలపై భా రం పడుతోంది. ఇక్కడ పనిచేసిన ఇన్‌చార్జ్ సూ పరింటెండెంట్ బదిలీ కాగానే కొత్త వారు బాధ్యతలు తీసుకోవాలి. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల పేదల పెద్దాసుపత్రికి బాస్‌గా ఎవరూ వస్తారో సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ ఉన్నతాధికారి ఎంజీఎంతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నూతనంగా నిర్మాణం పూర్తి కావొస్తున్న 24 అంతస్తుల వరంగల్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఇంత పెద్దాసుపత్రులకు నూతన బాస్ పోస్టింగ్ ఎందుకో జాప్యం జరుగుతోంది. అయితే ఎంజీఎంలో ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ వస్తేనే సూపర్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్‌ను నియమించాల్సి ఉంటుంది. దీంతో కొత్త సూపరింటెండెంట్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.


