హన్మకొండ చౌరస్తా: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం విధివిధానాలను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించిందని తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. హనుమకొండ కాకతీయకాలనీలోని ప్రముఖ న్యాయవాది గుడిమల్ల రవికుమార్ నివాసంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆవిర్భావ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ ఉద్యమకారుల సంక్షేమం కోసం నియమించిన కమిటీ రాష్ట్రస్థాయిలో విస్తృత సమావేశాలు నిర్వహిస్తుందని, త్వరలోనే శుభవార్త చెబుతుందన్నారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హాజరైన మలిదశ ఉద్యమకారుల సమక్షంలో ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్‌గా గుడిమల్ల రవికుమార్‌ను ప్రకటించారు. ఈ సందర్బంగా గుడిమల్ల రవికుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, రూ.5వేల పింఛన్, ఆరోగ్యబీమా, గుర్తింపు కార్డులు, 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఐక్యవేదిక రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసేందుకు 20 మందితో కూడిన కమిటీని నియమించారు. సందెల సునీల్, ఓడపల్లి శ్యాంకృష్ణ, అనుముల రమేశ్, ఎండీ చాంద్‌పాషా, బొలిశెట్టి అశోక్, నెల్సన్, మీర్జా అంజద్, గోపగాని రాజు, టి.మనోహర్, చెన్నూరి నటరాజ్, జక్కుల స్వామి, రాంకుమార్, దస్తగిరి, బెజ్జంకి అశోక్, స్వర్ణలత, పద్మ, బరిగెల కృష్ణమూర్తి, ఉమ, సత్యం, రాజుతో కమిటీని ఏర్పాటు చేశారు.
తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి
వెంకటనారాయణ


