● కటాక్షపూర్‌లో ఘటన
ఆత్మకూరు : గుర్తు తెలియని లారీ ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సిరంశెట్టి సాంబయ్య(66) తనకు ఎవరూ లేకపోవడంతో తన తమ్ముడి కుమారుడి ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం బహిర్భూమికి వెళ్లడానికి రోడ్డు దాటుతుడున్నాడు. ఈ సమయంలో ములుగు నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్న గుర్తుతెలియని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో సాంబయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తమ్ముడి కుమారుడు సిరంశెట్టి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.
బైక్.. చెట్టును ఢీకొని ఇప్పలగూడెంలో వ్యక్తి..
వెంకటాపురం(కె): బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం ఇప్పలగూడెం గ్రామ శివారులో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఏటూరునాగారం మండలం ఎలిశెట్టి పల్లి గ్రామానికి చెందిన మడప నందయ్య(45), నూకాల మహేశ్ బైక్‌పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నర్సపురం గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఇప్పలగూడెం గ్రామ శివారులో మలుపు వద్ద బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన గ్రామస్తులు 108లో వెంకటాపురం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నందయ్య మృతి చెందాడు.


