● రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై యువకుడి మృతి
తొర్రూరు : నిర్లక్ష్యం ఒకరి ప్రాణం బలిగొంది. హెల్మెట్ ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై ఓ యువకుడి ప్రా ణం గాలిలో కలిసింది. ఈ విషాదకర ఘటన తొర్రూరు పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్‌రెడ్డి కథనం మేరకు.. మండలంలోని గుర్తూరు గ్రామానికి చెందిన జడల నవీన్(32) నెల్లికుదురు ఎంపీడీఓ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య పిల్లలతో తొర్రూరులో నివాసముంటున్నాడు. ఆదివారం సెలవు కా వడంతో తల్లితో చేపల కూర వండించుకుని తిందా మని స్వగ్రామ గుర్తూరుకు బైక్‌పై బయలుదేరాడు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సమీపంలో ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్.. బైక్‌ను ఢీకొంది. దీంతో యువకుడి తలకు తీవ్ర గాయమైంది. కాళ్లు నుజ్జునుజ్జ య్యాయి. స్థానికులు గుర్తించి స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణం కోల్పోయాడు. ఘటనా స్థలిని సందర్శించిన ఎస్సై యువకుడికి తలకు తీవ్రగాయమవడం వల్లే ప్రాణాలు కోల్పోయాడని, తె లిపారు. అందరూ హెల్మెట్ ధరించి ప్రాణాలు కా పాడుకోవాలని స్థానికులకు సూచించారు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు సూర్యాపేటలోని టేకుమట్లకు చెందిన ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ నరేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఎస్సై అరెస్ట్
వరంగల్ క్రైం: ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సీసీఎస్ విభాగంలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రాజ్‌కుమార్‌ను ఆదివారం అరెస్టు చేసినట్లు హనుమకొండ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. నాలుగేళ్ల క్రితం ఓ వివాహిత న్యా యం కోసం హనుమకొండ పోలీసులను ఆశ్రయించింది. అయితే, అప్పుడు అక్కడ విధులు నిర్వర్తిస్తు న్న రాజ్‌కుమార్ ఆ మహిళను పెళ్లి పేరుతో మోసం చేయడమేకాకుండా శారీరక సంబంధం ఏర్పర్చుకున్నాడు. చివరికి పెళ్లికి నిరాకరించడంతో సదరు మ హిళ హనుమకొండ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కే సు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ శివకుమార్ తెలి పారు. సదరు ఎస్సై రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి కో ర్టులో హాజరు పరిచినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.


