గుప్తనిధుల పేరిట బురిడీ | - | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల పేరిట బురిడీ

Jun 14 2026 10:31 AM | Updated on Jun 14 2026 10:31 AM

ఏటూరునాగారం: పాత బంగారం ఇస్తే కిలో కొత్త బంగారం ఇస్తామని మాయమాటలు చెప్పి మోసం చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బొంగురు మహేష్‌ తెలిపారు. శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. మూడు తులాల పాత బంగారం, పుస్తెల తాడు ఇస్తే పూజలు చేసి కొత్త బంగారం కిలో ఇస్తామని మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన షేమినా, రజియా, షేమినా భర్త రబ్బాని మోసం చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో వారిపై కేసు నమోదు చేశామన్నారు. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన చిదురాల వాసుదేవ్‌ అతడి భార్య శ్వేత వద్దకు వెళ్లిన సదరు మహిళలు తమకు గుప్తనిధుల్లో బంగారం దొరికిందని, పాత బంగారం ఇస్తే కిలో కొత్త బంగారం ఇస్తామని చెప్పి వారి వద్ద నుంచి మూడు తులాల బంగారం పుస్తెలతాడుతోపాటు తవ్వకాల్లో దొరికిన బంగారం ఇస్తామని చెప్పి రూ.14 లక్షల నగదును కూడా ఈ ముఠా సభ్యులు వాసుదేవ్‌వద్ద తీసుకున్నారు. ఆ తర్వాతముఖం చాటేసి ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతుండగా వాసుదేవ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ముగ్గురు నిందితులు మరికొన్ని మోసాలకు కూడా పాల్పడినట్లు తెలుస్తోందని తెలిపారు.

ముగ్గురు మహిళలపై కేసు

ఎస్సై బొంగురు మహేష్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement