● గిరిజన శాఖ డీడీ దేశీరాం నాయక్
కురవి: బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేశీరాం నాయక్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎంలు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలని, బడిఈడు పిల్లలను బడిలో చేరే విధంగా చూడాలన్నారు. ఈవిద్యాసంవత్సరం వంద శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏసీఎంఓ డి.రాములు, డిప్యూటీ డీఈఓడీ సారయ్య, జీసీడీఓ విజయ, ఎస్‌ఓ కొమ్మాలు, డీఆర్సీ శ్రీకాంత్, అకౌంటెంట్ సుహాసిని, హెచ్‌ఎం బాబు, వార్డెన్ బి.పద్మ పాల్గొన్నారు.


