కళాశాలల్లో అడ్మిషన్లు పెంచాలి | - | Sakshi
Sakshi News home page

కళాశాలల్లో అడ్మిషన్లు పెంచాలి

Jun 13 2026 1:41 PM | Updated on Jun 13 2026 1:41 PM

కలెక్టర్‌ స్నేహా శబరీష్‌

మహబూబాబాద్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ స్నేహా శబరీష్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో శుక్రవారం ఇంటర్‌ విద్య తదితర విషయాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాతూ విద్యార్థుల హాజరు శాతాన్ని పకడ్బందీగా నిర్వహించి ప్రతీ నెల స్క్రిప్టు టెస్టులు నిర్వహిచాలన్నారు. మరమ్మతులు ఉంటే వాటి కోసం ప్రదిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య పెంచి రుచికరమైన భోజనం అందించాలని తెలిపారు. వసతి గృహాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. డీఐఈఓ మదార్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement