మార్కెట్‌ పనివేళల్లో మార్పులు | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ పనివేళల్లో మార్పులు

Jun 13 2026 1:41 PM | Updated on Jun 13 2026 1:41 PM

ఖిలా వరంగల్‌ : వరంగల్‌ ఏనుమాము ల వ్యవసాయ మార్కెట్‌లో పని వేళల్లో మార్పులు చేస్తున్నట్లు మార్కెట్‌ కార్యదర్శి మల్లేశం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండ తీవ్రత తగ్గడం వల్ల ఈ నెల 16వ తేదీ నుంచి సరుకుల బిడ్డింగ్‌ సమయాలను పాత పద్ధతి, ప్రతీ బుధవారం పనిదినంగా ప్రకటించామ ని తెలిపారు. మిర్చి ఉదయం 7.30 గంటలకు, పల్లికాయ ఉదయం 8.30 గంటలకు, పత్తి ఉదయం 8.35 గంటలకు, పసుపు, ధాన్యం, అపరాలు ఉదయం 9 గంటలకు వేలం ప్రారంభం కానుందన్నారు. రైతులు గమనించి పని దినాల్లో సరుకులు తీసుకురావాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement