జమ్మూ అండ్‌ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కలిసిన యశ్వంత్‌ | - | Sakshi
Sakshi News home page

జమ్మూ అండ్‌ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కలిసిన యశ్వంత్‌

Jun 13 2026 1:41 PM | Updated on Jun 13 2026 1:41 PM

మరిపెడ రూరల్‌: జమ్మూ అండ్‌ కశ్మీర్‌ లైఫ్టినెంట్‌ గవర్నర్‌ శ్రీ మనోజ్‌ సిన్హాను మహబాబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన పర్వతారోహకుడు భూక్య యశ్వంత్‌ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా గవర్నర్‌కు తన పర్వతారోహణ ప్రయాణం, సాహస యాత్రలో ఎదుర్కొన్న అనుభవాలు, అలాగే తాను చేపట్టిన ‘హర్‌ శిఖర్‌ పర్‌ తిరంగా’ మిషన్‌ లక్ష్యాలు వివరించా రు. ఇటీవల తాను విజయవంతంగా పూర్తి చేసి న లద్దాఖ్‌ పర్వతారోహణ యాత్ర గురించిన లె ఫ్టినెంట్‌ గవర్నర్‌కు వివరించగా..యశ్వంత్‌ను ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపాడు. నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న య శ్వంత్‌ కృషిని ప్రశంసిస్తూ, భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

అంత్యపుష్కరాల ఆదాయం

రూ.97.27లక్షలు

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో మే 21 నుంచి ఈనెల 1వ తేదీ వరకు నిర్వహించిన సరస్వతీనది అంత్య పుష్కరాల్లో భక్తులకు అందించిన ప్రసాదాల విక్రయాలు, వివిధ సేవా టికెట్ల ద్వారా దేవస్థానానికి రూ.97లక్షల 27వేల 500 ఆదాయం సమకూరిందని ఈఓ మహేశ్‌ శుక్రవారం తెలిపారు. పుష్కరాల కాలంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరించి, దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు ప్రసాదాలు, సేవా టికెట్లను వినియోగించారని చెప్పారు. భక్తుల సహకారం, అధికారుల సమన్వయం, సిబ్బంది సేవల ఫలితంగా ఈ ఆదాయం లభించినట్లు ఆయన పేరొన్నారు.

నాటికలు యదార్థ జీవితాలకు ప్రతిబింబాలు

కేయూ విశ్రాంతాచార్యుడు

బన్న అయిలయ్య

ఘనంగా జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం

హన్మకొండ కల్చరల్‌ : నాటికలు యదార్థ జీవితాలకు ప్రతిబింబాలని, కళలు, కళాకారులను ప్రోత్సహించాలని కేయూ విశ్రాంతాచార్యుడు బన్న అయిలయ్య కోరారు. వరంగల్‌ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే 17వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు శుక్రవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. రంగస్థల కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్‌ కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బన్న అయిలయ్య, విశిష్ట అతిథులుగా డాక్టర్‌ శ్రీరామోజు సుందరమూర్తి, డాక్టర్‌ ఎన్‌ఎస్‌ఆర్‌ మూర్తి, నేరెళ్ల శోభావతి, జేఎన్‌ శర్మ, గంజి దేవరాజు హాజరై జ్యోతిప్రజ్వలన చేసి నాటిక పోటీలను ప్రారంభించారు. కాగా, పోటీల్లో భాగంగా మొదటి రోజు ‘మంచి మనసులు’, ‘నువ్వో సగం నేను సగం’ నాటిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement