కాశిబుగ్గ: గతంలో మాదిరి చేనేత ఉత్పత్తులను టెస్కో ద్వారా కొనుగోళ్లకు కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్ కొత్తవాడ గోపాలస్వామి గుడి జంక్షన్‌లో వారం రోజుల నుంచి దీక్ష చేస్తున్న నేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పటికే తాను సంబంఽధిత మంత్రి, సీఎంఓ ఆఫీస్ లో చెప్పి వచ్చానని, సంఘాల్లో ఉన్న స్టాక్ కొనుగోలు గురించి మాట్లాడానని, అధికారులు వచ్చి పరిష్కారం చేస్తారని పేర్కొన్నారు. సీఎం ఢిల్లీలో ఉన్నారని, వచ్చిన తర్వాత ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తారని వివరించారు. సీఎం కూ డా చేనేత కార్మికులకు తోడుగా ఉంటూ సమస్య పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని, వెంటనే సంఘాల్లో మే 31 వరకు ఉన్న స్టాక్‌ను టెస్కో ద్వారా కొనుగోలు చేసేలా సహకారం అందిస్తానని, అలాగే 30 శాతం పెరిగిన వేతనాలు కూడా చెల్లించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చేనేత సహకార సంఘం ప్రతినిధులు పంతగాని శ్రీనివాస్, అడిగొప్పుల సంపత్, యెలగం వెంకటమల్లు, యెలగం సాంబయ్య, చిప్ప వెంకటేశ్వర్లు, మీసాల ప్రకాశ్, యెలగం ఓంప్రకాశ్, కూరపాటి సంపత్, కమలాకర్, రమేశ్, ఓదెలు, భిక్షపతి, మదనయ్య, వేణుమాధవ్ పాల్గొన్నారు.
దీక్షలు విరమించిన
చేనేత కార్మికులు..
చేనేత ఉత్పత్తులను టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని, టెండర్ విధానం రద్దు చేయాలని కోరుతూ వందలాది మంది చేనేత కార్మికులు కొత్తవాడ గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద వారం రోజుల నుంచి దీక్షలు చేపడుతున్న విషయం విధితమే. ఈ క్రమంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ హామీతో శుక్రవారం మధ్యాహ్నం విరమించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖకు టీపీసీసీ నేత చిప్ప వెంకటేశ్వర్లు, పలు సంఘాల పర్సన్ ఇన్‌చార్జ్‌లు అడిగొప్పుల సంపత్, యెలగం సాంబయ్య, యెలగం వెంకటమల్లు, కూరపాటి సంపత్, ఓం ప్రకాశ్, మదనయ్య కృతజ్ఞతలు తెలిపారు.
వారం రోజుల్లో నేత కార్మికుల
సమస్య పరిష్కారం
రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ
మంత్రి కొండా సురేఖ
మంత్రి హామీతో దీక్షలు విరమించిన కార్మికులు


