మొదటిసారి త్రీడీ టెక్నాలజీతో రెండేళ్ల చిన్నారికి కిడ్నీ ఆపరేషన్‌ | - | Sakshi
Sakshi News home page

మొదటిసారి త్రీడీ టెక్నాలజీతో రెండేళ్ల చిన్నారికి కిడ్నీ ఆపరేషన్‌

Jan 18 2026 8:16 AM | Updated on Jan 18 2026 8:16 AM

మొదటి

మొదటిసారి త్రీడీ టెక్నాలజీతో రెండేళ్ల చిన్నారికి కిడ్నీ

హన్మకొండ చౌరస్తా: వరంగల్‌లో మొదటిసారి రెండేళ్ల చిన్నారికి అధునాతన త్రీడీ టెక్నాలజీ సాయంతో లాప్రోస్కోపిక్‌ ద్వారా కిడ్నీ ఆపరేషన్‌ విజయవంతంగా చేసినట్లు యూరాలజిస్టు రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. హనుమకొండలోని వెయ్యిస్తంభాల గుడి ఎదుట గల శ్రీశ్రీనివాస కిడ్నీ సెంటర్‌లో జరిగిన ఆపరేషన్‌ వివరాలను శనివారం వెల్లడించారు. మహబూబాబాద్‌కు చెందిన వి. వేదాన్షికి కిడ్నీ నుంచి మూత్రం తీసుకెళ్లే నాళం సన్నబడింది. చికిత్స కోసం హైదరాబాద్‌లోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రులకు తీసుకెళ్లగా రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతాయని తెలపడంతో అక్కడి నుంచి తమ ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. మరోసారి అన్ని వైద్య పరీక్షలు చేసి చిన్నారికి ఫైలోప్లాస్టి ఆపరేషన్‌ను దిగ్విజయంగా చేసి, కేవలం 72 గంటల్లో డిశ్చార్జ్‌ చేసినట్లు తెలిపారు. ఇదే తరహాలో మరో మూడు త్రీడీ లాప్రోస్కోపిక్‌ సర్జరీలను విజయవంతంగా చేసినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో డాక్టర్‌ రఫీ, అనస్థీషియా డాక్టర్‌ సామ్రాట్‌ పాల్గొన్నట్లు తెలిపారు.

‘ఫైమా’ జాతీయ తాత్కాలిక అధ్యక్షుడిగా శ్రీనాథ్‌

ఎంజీఎం: ఆలిండియా మెడికల్‌ అసోసియేషన్‌ సమాఖ్య (ఫైమా) జాతీయ తాత్కాలిక అధ్యక్షుడిగా వరంగల్‌ రంగశాయిపేటకు చెందిన డాక్టర్‌ శ్రీనాథ్‌ను నియమిస్తూ పైమా జాతీయ గౌరవ అధ్యక్షుడు రోహన్‌ కృష్ణ, చైర్మన్‌ డాక్టర్‌ మనీష్‌ ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్‌ శ్రీనాథ్‌ ఫైమాలో అంకితభావంతో పనిచేయడమే కాకుండా తెలంగాణ సీనియర్‌ రెసిడెంట్‌ (ఎస్‌ఆర్‌) డాక్టర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా సైతం కొనసాగుతున్నారు. దేశం మొత్తం వైద్యుల సంక్షేమం, హక్కులు, వృత్తి పరమైన ప్రయోజనాల కోసం డాక్టర్‌ శ్రీనాథ్‌ కృషి చేస్తున్నారు.

చేపల వేటకు వెళ్లి..

వలలో చిక్కుకొని మత్స్యకారుడి మృతి

దుగ్గొండి : చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు వ లలో చిక్కి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని వెంకటాపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చెక్క రమేశ్‌ (62) శుక్రవారం సాయంత్రం చేపలు పట్టేందుకు వల పట్టుకుని ఊరకుంట వద్దకు వెళ్లాడు. ఈ క్ర మంలో రాత్రి అయినా ఇంటికి రాలేదు. దీంతో రమేశ్‌ భార్య గ్రామంలోనే ఉ న్న తన కూతురు ఇంటికి వెళ్లాడనుకుని నిద్రపోయింది. శనివా రం ఉదయం ఊరకుంట వైపున కు వెళ్లిన రైతులకు రమేశ్‌ సైకిల్‌, దుస్తులు కనిపించాయి. దీంతో వారు చెరువు లోపలికి వెళ్లి చూడగా వలలో చిక్కి ఉన్నాడు. కుటుంబీకులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. చెరువు నుంచి రమేశ్‌ను బయటకు తీయగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతుడికి భార్య రమ, కూతురు వసంత ఉన్నారు. రమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నట్లు ఎస్సై రావుల రణధీర్‌రెడ్డి తెలిపారు.

మొదటిసారి త్రీడీ టెక్నాలజీతో రెండేళ్ల చిన్నారికి కిడ్నీ1
1/3

మొదటిసారి త్రీడీ టెక్నాలజీతో రెండేళ్ల చిన్నారికి కిడ్నీ

మొదటిసారి త్రీడీ టెక్నాలజీతో రెండేళ్ల చిన్నారికి కిడ్నీ2
2/3

మొదటిసారి త్రీడీ టెక్నాలజీతో రెండేళ్ల చిన్నారికి కిడ్నీ

మొదటిసారి త్రీడీ టెక్నాలజీతో రెండేళ్ల చిన్నారికి కిడ్నీ3
3/3

మొదటిసారి త్రీడీ టెక్నాలజీతో రెండేళ్ల చిన్నారికి కిడ్నీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement