తండ్రి మందలించాడని కుమారుడి ఆత్మహత్య
హసన్‌పర్తి: తండ్రి మందలించాడని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం జయగిరి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జయగిరికి చెందిన ఆలేటి విఘ్నేష్ (17) వరంగల్‌లోని ఓ కళాశాలలో ఐటీఐ మొదటి సంవత్సరం అభ్యసిస్తున్నాడు. కొంతకాలంగా కళాశాలకు వెళ్లకపోవడంతో తండ్రి రమేశ్ మందలించాడు. దీంతో మానస్తాపం చెందిన విఘ్నేష్ ఇంటి పక్కన ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో
కుసుంబాయితండాలోవ్యక్తి..
రఘునాథపల్లి: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మండలంలోని రామన్నగూడెం జీపీ పరిధి కుసుంబాయితండాలో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. తండాకు చెందిన మారాటి వెంకన్న (44) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూ తురు పెళ్లి చేశాక చిన్న కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆస్తిలో వాటా ఇవ్వాలంటూ ఇద్దరూ తండ్రితో గొడవకు దిగారు. ఈ విషయంపై పెద్ద మనుషుల వద్ద పంచాయితీ నిర్వహించగా ఉన్న ఎకరంన్నర భూమిలో అర ఎకరం తల్లిదండ్రులు ఉంచుకుని ఎకరం భూమిని ఇద్దరికీ సమానంగా ఇవ్వాలని, అలాగే చిన్న కూతురు మానసకు మూడు తులాల బంగారం ఇవ్వాలని తీర్పునిచ్చా రు. అప్పటి నుంచి వెంకన్న మానసికంగా కృంగి పోతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం నాటు వేయాలని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అక్కడే పురుగుల మందు తాగి పడిపోయాడు. దీనిని పక్కన రైతులు కొర్రు సక్రు, భూక్య శంకర్ చూసి జనగామ ప్రభు త్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇద్దరు కుమార్తెల ఒత్తిడితోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.


