సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ట్రెయినీ ఐఏఎస్‌లు
ఏటూరునాగారం: మేడారం మహాజాతరకు నేడు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు రానున్న నేపథ్యంలో ఖమ్మం ట్రెయినీ ఐఏఎస్‌లు గోషాన్, కృనాల్ వంశీతోపాటు పలువురు హరిత హోటల్‌లోని ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. సీఎం ముందుకు ఎక్కడ కూర్చుని మాట్లాడాలి.. మంత్రులతో సమీక్ష ఏ విధంగా చేపట్టాలనే విషయాలపై చర్చించారు. ఆయనకు ప్రత్యేక సెక్యూరిటీతోపాటు ఇతర అధికా రులను అలాట్ చేశారు. కేవలం వారికి మా త్రమే అనుమతి ఉండేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నా రు. అడిషనల్ ఎస్పీ సదానందం.. హరిత హోటల్‌లోని ఇతరులు రాకుండా బారికేడ్లతోపాటు కొన్ని ద్వారాలను మూసివేయించారు. ఆర్డీఓ వెంకటేష్‌కు ట్రెయినీ ఐఏఎస్‌లు పలు సూచనలు చేశారు. స్పీకర్స్ పూర్తి చేసి సర్టిఫైయ్ చేసి పత్రాన్ని ఇవ్వాలని ఐఅండ్‌పీఆర్ అధికారులను ఆదేశించారు.


