రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మేలు
కురవి: రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని డీఏఓ సరిత సూచించారు. సోమవారం సీరోలు మండలం కాంపల్లి రైతు వేదికలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ద్వారా అందే పథకాలు వర్తించాలంటే విధిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. పత్తి పంట తర్వాత వేసిన రైతు పెసర పంట క్షేత్రాన్ని సందర్శించారు. రైతులు పప్పు దినుసుల సాగుపై దృష్టి సారించాలని తెలిపారు. తాళ్లసంకీస రైతు వేదికలో యూరియా కూపన్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. కార్యమ్రంలో సీరోలు ఏఓ చాయారాజ్ తదితరులు పాల్గొన్నారు.
కాంపల్లి రైతు వేదికలో మాట్లాడుతున్న డీఏఓ సరిత


