తుది ఓటరు జాబితా ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

తుది ఓటరు జాబితా ప్రదర్శన

Jan 13 2026 5:51 AM | Updated on Jan 13 2026 5:51 AM

తుది

తుది ఓటరు జాబితా ప్రదర్శన

మహబూబాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమవారం తుది ఓటరు జాబితాను ప్రదర్శించారు. కాగా జిల్లాలోని మానుకోట ము న్సిపల్‌ ఓటరు జాబితాను కార్యాలయం నోటీసు బోర్డుపై ఏర్పాటు చేశారు. కమిషనర్‌ రాజేశ్వర్‌, టీపీఓ సాయిరాం, టీపీఎస్‌ ప్రవీణ్‌, మేనేజర్‌ శ్రీధర్‌ బృందం జాబితాను తయారు చేశారు. కాగా మున్సిపాలిటీలో 36వార్డుల్లో మొత్తం 65,712 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. గత ఎన్నికల్లో 57,828 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం సంఖ్య పెరిగింది.

డోర్నకల్‌ ఓటర్లు 1,0869మంది..

డోర్నకల్‌: డోర్నకల్‌ మున్సిపాలిటీ తుది ఓటరు జాబితాను సోమవారం ప్రకటించారు. మున్సిపల్‌ కమిషనర్‌ నిరంజన్‌ తుది ఓటరు జాబితాను విడుదల చేసి మున్సిపాలిటీ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. 15 వార్డుల్లో 1,0869 మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో 16 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. 2019 జనవరిలో జరిగిన మొదటి మున్సిపాలిటీ ఎన్నికల్లో వార్డుకు ఒక పోలింగ్‌ కేంద్రం చొప్పున 15 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 5వ వార్డులో ఎక్కువమంది ఓట్లు ఉన్నందున అదనంగా పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

21,451మంది ఓటర్లు..

తొర్రూరు: తొర్రూరు మున్సిపాలిటీ తుది ఓటరు జాబితాను సోమవారం అధికారులు ప్రకటించారు. డివిజన్‌ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్‌ వక్కల శ్యామ్‌సుందర్‌ తుది ఓటరు జాబితా విడుదల చేశారు. మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో మొత్తం 21,451 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో 19,100 ఓటర్లు ఉండగా ప్రస్తుతం 2,351 మంది ఓటర్లు పెరిగారు. మంగళవారం పోలింగ్‌ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితా ప్రచురించి వాటిని ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టి–పోల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు. ఈనెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతో పాటు ఫొటోతో కూడిన ఓటరు తుది జాబితా ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించనున్నారు.

కేసముద్రంలో..

కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ తుది ఓటరు జాబితాను సోమవారం మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్‌ పరిధి 16 వార్డుల్లో 15,945 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఇందులో 7,754 మంది పురుషు ఓటర్లు, 8,191 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిపెడలో..

మరిపెడ రూరల్‌: మరిపెడ మున్సిపాలిటీ తుది ఓటరు జాబితాను సోమవారం కమిషనర్‌ విజయానంద్‌ సిబ్బందితో కలిసి ప్రదర్శించారు. మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో 13,687మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 6,709మంది పురుష ఓటర్లు, 6,978 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

మున్సిపాలిటీల్లో జాబితాను విడుదల చేసిన అధికారులు

మహిళా ఓటర్లే అధికం.. వారి తీర్పే కీలకం

మున్సిపాలిటీల తుది ఓటరు జాబితా

మున్సిపాలిటీ పురుష మహిళా ఇతరులు మొత్తం

ఓటర్లు ఓటర్లు

మానుకోట 31,550 34,121 41 65,712

డోర్నకల్‌ 5,160 5,709 0 1,0869

తొర్రూరు 10,501 10,942 8 21,451

కేసముద్రం 7,754 8,191 0 15,945

మరిపెడ 6,709 6,978 0 13,687

తుది ఓటరు జాబితా ప్రదర్శన1
1/1

తుది ఓటరు జాబితా ప్రదర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement