విద్యుత్ వినియోగదారులకు సంక్రాంతి లేఖలు
నెహ్రూసెంటర్: వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు విద్యుత్ సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ పి.విజయేందర్‌రెడ్డి సోమవారం తెలిపారు. గృహజ్యోతి లబ్ధిదారులు, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షల లేఖలను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. సర్వీస్ కనెక్షన్ నంబర్‌తో వ్యక్తిగతంగా డిప్యూటీ సీఎం అడ్రస్ చేసిన లేఖలను విద్యుత్ అధికారులు నేరుగా లబ్ధిదారులకు అందజేస్తారన్నారు. 52,82,498 మంది గృహజ్యోతి లబ్ధిదారులు, 30,03,813 మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు శుభాకాంక్షల లేఖలు పంపిణీ చేయనున్నట్లు ఎస్‌ఈ తెలిపారు.


