కనులపండువగా గోదారంగనాథుల కల్యాణం
మహబూబాబాద్ రూరల్: ధనుర్మాస వ్రత మహోత్సవ పూజా వేడుకల్లో భాగంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అనంతాద్రి జగన్నాథ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గోదారంగనాథుల కల్యాణ వేడుకలను సోమవారం కనులపండువగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ నూకల రామచంద్రారెడ్డి–జ్యోతి దంపతులు, ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలపై గోదాదేవి అమ్మవారు, రంగనాథ స్వామివారిని కొలువుదీర్చి సహ అర్చకులు శ్రవణకుమారాచార్యులు కల్యాణోత్సవం జరిపారు.
నూతన కమిటీ ఎన్నిక
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దివ్యాంగుల హక్కు ల జాతీయ వేదిక జిల్లా నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా తేజావత్ హనుమంత్ నాయక్, ఉపాధ్యక్షులుగా మాలోతు శంకర్‌నాయక్, పి.వీరన్న, కోశాధికారులుగా పి.ఉపేందర్, టి.హుస్సేన్‌నాయక్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా రాజ్‌కుమార్, సైదులు, లాలునాయక్, సుమన్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు హనుమంత్ నాయక్ మాట్లాడుతూ.. బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని, రూ.6వేల పింఛన్ అందించాలన్నారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారుడు అబ్బనపురి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
మహబూబాబాద్ అర్బన్: విద్యార్ధులు, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఛీప్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నాగేశ్వర్‌రావు అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని అనంతారం నలంద డిగ్రీ కళాశాలలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. యువశక్తి దేశానికి అంకితం కావాలని, చెడు మార్గాలకు దూరంగా ఉండాలన్నారు. ఎన్‌డీపీఎస్ చట్టప్రకారం డ్రగ్స్ కొనుగోలు చేసిన.. విక్రయించినా పదేళ్లు జైలు శిక్షపడుతుందన్నారు. ఇతర న్యాయ సేవలకు టోల్‌ఫ్రీ నంబర్ 15100లో ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్‌కృష్ణ, ప్రిన్సిపాల్ కృష్ణప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టెన్త్ ప్రీఫైనల్ టైంటైబుల్ విడుదల
విద్యారణ్యపురి: టెన్త్ విద్యార్థులకు ఈఏడాది ఫిబ్రవరి 17 నుంచి 24వ తేదీ వరకు ప్రీ–ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు డీఈఓలను ఆదేశించారు. ప్రీ–ఫైనల్ పరీక్షల టైంటేబుల్‌ను కూడా ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫిబ్రవరి 17న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 19న థర్డ్ లాంగ్వేజ్, 20న మేథమెటిక్స్, 21న ఫిజికల్ సైన్స్, 23న బయాలాజికల్ సైన్స్, 24న సోషల్ స్టడీస్ నిర్వహించనున్నారు. ఈమేరకు సంబంధిత పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
రామప్ప హుండీ ఆదాయం రూ.6,71,954
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామప్ప దేవాలయ హుండీ కానుకలను సోమవారం లెక్కించారు. రూ.6,71,954 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్ తెలిపారు. దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ కుమారస్వామి సమక్షంలో హుండీ కానుకలను శ్రీవల్లి సేవా సమితి సభ్యులు లెక్కించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గిరిబాబు, సర్పంచ్ చల్లగోండ రాజు, రామప్ప ఆలయ ప్రధాన పూజారి హరీశ్ శర్మ, అర్చకుడు ఉమాశంకర్, టూరిజం గైడ్‌లు విజయ్‌కుమార్, వెంకటేశ్ పాల్గొన్నారు.
కనులపండువగా గోదారంగనాథుల కల్యాణం
కనులపండువగా గోదారంగనాథుల కల్యాణం


