సర్పంచ్‌ల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కమలాకర్‌ | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కమలాకర్‌

Jan 12 2026 7:44 AM | Updated on Jan 12 2026 7:44 AM

సర్పం

సర్పంచ్‌ల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కమలాకర్‌

చిన్నగూడూరు: సర్పంచుల ఫోరం ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి గ్రామ సర్పంచ్‌ గునిగంటి కమలాకర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్‌ చాంబర్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ సర్పంచ్‌ల సంఘం సమావేశంలో తెలంగాణ పంచాయతీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నట్లు కమలాకర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సర్పంచ్‌ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా కమలాకర్‌ తెలిపారు.

మాషుక్‌ రబ్బానీ ఉర్సు ప్రారంభం

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఉర్సు కరీమాబాద్‌లోని హజ్రత్‌ సయ్యద్‌షా జలాల్‌ద్దీన్‌ జామలుల్‌ బహార్‌ మాషుక్‌ –ఏ–రబ్బానీ 470వ ఉర్సు దర్గా ఉత్సవాలు ఆదివారం రాత్రి ప్రారంభమయ్యాయి. దర్గా పీఠాధిపతులు నవీద్‌బాబా, ఉబేదాబాబా ఆధ్వర్యంలో పీఠాధిపతుల ఇంటి నుంచి అర్ధరాత్రి గంధం, చాదర్‌ను ఊరేగించారు. ముస్లిం మతపెద్దలు మాషూక్‌ రబ్బానీ దర్గా (సమాధి)కు గంధాన్ని సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులు దర్గాపై గిలాఫ్‌, పూలు సమర్పించారు. రెండో రోజు సోమవారం ఉర్సు, మూడో రోజు బాదావ నిర్వహించనుందని పీఠాధిపతులు తెలిపారు. ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరై దర్గాను సందర్శించి చాదర్‌, పూలు సమర్పించారు. ఆనంతరం పీఠాధిపతులతో కలిసి మంత్రి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. కార్పొరేటర్‌ మరుపల్లి రవి, ఎండీ ముగ్దుం, గోపాల నవీన్‌, మీసాల ప్రకాశ్‌, తదితరులు పాల్గొన్నారు.

పేరిణి నాట్యకళను

అందించాలి

హన్మకొండ కల్చరల్‌: విద్యార్థులకు శాసీ్త్రయ, సంప్రదాయమైన పేరిణి నాట్యకళను అందించాలని ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ యువ కేంద్ర పురస్కార అవార్డు గ్రహీత పేరిణి ధరావత్‌ రాజ్‌కుమార్‌ అన్నారు. వరంగల్‌ బ్యాంకు కాలనీలోని పేరిణి నృత్యాలయంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల యువ పేరిణి నాట్యాచార్యుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. అకాడమీ నిర్వాహకులు గజ్జెల రంజిత్‌ అధ్యక్షతన జరిగిన శిక్షణ శిబిరంలో రాజ్‌కుమార్‌ పాల్గొని నూతన పేరిణి గురువులకు మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమం అనంతరం రాజ్‌కుమార్‌, నృత్యకౌముది అవార్డు గ్రహీతలు బండారి వైష్ణవి, తొడెన్గా సంతోష్‌యాదవ్‌, పేరిణి ఆధ్యాపకులను సన్మానించారు. కార్యక్రమంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్యకళాశాల అధ్యాపకులు చాతరాజు నవ్యజ, అకాడమీ ఆధ్యక్షులు మోతుకూరి చంద్రకళ, రామకృష్ణ, అంజలి, రవితేజ, శ్రీజ, రాజేందర్‌ తదితరులు పాత్గొన్నారు.

సర్పంచ్‌ల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కమలాకర్‌
1
1/3

సర్పంచ్‌ల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కమలాకర్‌

సర్పంచ్‌ల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కమలాకర్‌
2
2/3

సర్పంచ్‌ల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కమలాకర్‌

సర్పంచ్‌ల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కమలాకర్‌
3
3/3

సర్పంచ్‌ల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కమలాకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement