ఉపాధి లభించడం లేదనే మనస్తాపంతో..
వ్యక్తి ఆత్మహత్య
● బచ్చన్నపేటలో ఘటన
బచ్చన్నపేట : ఉపాధి లభించడం లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేటలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కతనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రానికి చెందిన చిట్టిమల్ల శివకృష్ణ (43)కు బచ్చన్నపేటకు చెందిన లావణ్యతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. శివకృష్ణ ఆలేరులో చేనేత పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. ఈ క్రమంలో కొంతకాలంగా ఉపాధి లభించకపోవడంతోపాటు ఆర్థిక కారణాలతో దంపతులు గొడవపడేవారు. ఆరు నెలల క్రితం లావణ్య.. భర్తతో గొడవపడి తల్లిగారి ఇల్లు బచ్చన్నపేటకు వచ్చింది. శివకృష్ణ అప్పుడప్పుడు బచ్చన్నపేటకు వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆదివారం బచ్చన్నపేటకు ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు కేకలు వేయగా చుట్టు పక్కల వారు వచ్చి చూడగా అప్పటికే చనిపోయాడు. ఈ ఘటనపై భార్య లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మునిపల్లిలో రైలు కింద పడి ప్రైవేట్ టీచర్..
హసన్‌పర్తి: ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మునిపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నడికూడ మండలం చర్లపల్లికి చెందిన దూడ రాజు యాదవ్(32) చింతగట్టు క్యాంప్ స మీపంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం బైక్ పై మునిపల్లిలోని రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నాడు. గుర్తు తెలియని రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య పాల్ప డ్డాడు.. కాగా, రాజుయాదవ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు మాత్రం త మకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


