మత్స్య రైతులకు చేప పిల్లల పంపిణీ
మామునూరు: మత్స్యరైతులకు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసినట్లు కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఎస్. బింధుమాధురి తెలిపారు. మంగళవారం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మత్స్యరైతులకు ఉచిత చేపపిల్ల లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మంచి నీటి ఆధారిత చేపల పెంపకానికి ఆదరణ ఉంటుందన్నారు. చేపల పెంపక విషయంలో ఎలాంటి సమస్యలున్నా కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ జి.గణేశ్, ఏ.రాజు, సస్యరక్షణ శాస్త్రవేత్త సాయి కిరణ్, పశువైద్య శాస్త్రవేత్త, తదితరులు పాల్గొన్నారు.


