యూడైస్‌లో వివరాలు నమోదు చేయాలి
●హనుమకొండ జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేశ్
విద్యారణ్యపురి: ప్రతీ పాఠశాలకు సంబంధించిన ఫిజికల్ లొకేషన్, భౌతిక వనరులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను యూడైస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని హనుమకొండ జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్ష ప్లానింగ్ కోఆర్డినేటర్ బి.మహేశ్ కోరారు. హనుమకొండలోని లష్కర్‌బజార్ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, ప్రతీ కాంప్లెక్స్‌కు ఒక ఉపాధ్యాయుడు, సీఆర్‌పీలకు యూడైస్‌లో వివరాలు నమోదు చేసే విధానంపై మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన పాఠశాల, టీచర్, స్టూడెంట్స్ ప్రొఫైల్‌పై ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానల్ ఉపయోగించే విధానాన్ని వివరించారు. జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడి, జిల్లా సైన్స్ అధికారి ఎస్. శ్రీనివాసస్వామి, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ రఘుచంద్రరావు, అసిస్టెంట్ ప్రోగ్రామర్ వినయ్‌కుమార్, టెక్నికల్ పర్సన్ రాజు పాల్గొన్నారు.


