దీప ప్రజ్వలనం.. సర్వం శుభకరం | - | Sakshi
Sakshi News home page

దీప ప్రజ్వలనం.. సర్వం శుభకరం

Nov 5 2025 8:46 AM | Updated on Nov 5 2025 8:46 AM

దీప ప్రజ్వలనం.. సర్వం శుభకరం

దీప ప్రజ్వలనం.. సర్వం శుభకరం

జోరుగా పూజాసామగ్రి

అమ్మకాలు..

ఉసిరిక భూగోళానికి ప్రతీక..

హన్మకొండ కల్చరల్‌: కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అంటే శివకేశవులకు అత్యంత ప్రీతికరం. దేవుళ్లు, రాక్షసులు కలిసి సముద్రమథనం చేసిన సమయంలో మొదట హాలాహలం (విషం) పుడుతుంది. ఈ హాలాహలంతో లోకానికి ముప్పు కలు గుతుందని శివుడు దానిని సేవిస్తాడు. ఈ సమయంలో పార్వతిదేవి తన భర్త(శివుడు) కంఠాన్ని పట్టుకుని తన భర్తకు ఏ ఆపద కలగొద్దని కోరుకుంటుంది. తన పతికి ఏ ఆపద కలగని పక్షంలో జ్వాలాతోరణం వెలిగిస్తానని మొక్కుకుందని పురాణాల్లో ఉందని పలువురు వేదపండితులు చెబుతున్నారు. ఆ విధంగా దేవాలయాల్లో ఈ రోజు జ్వాలా తోరణాలు వెలిగించే సంప్రదాయం వచ్చింది. ఇలా కార్తీకపౌర్ణమిని నిర్వహించుకుంటా టరు. పూర్వం ప్రతీ ఇంటి ఎదుట ప్రతీ రోజు గూ ళ్లలో ప్రదోషకాలవేళ దీపాలు వెలిగించేవారు. అ యితే ఇలా అందరికీ అన్ని వేళలా సాధ్యం కాదు. అందుకే అలా వీలు కానీ వారు కార్తీకపౌర్ణమి రో జున ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. తెల్లవారుజాముకు ముందే స్నానాలు ఆచరించి తులసి మొక్క వద్ద ఉసిరిక కొమ్మను నాటి దీపాలు వెలిగిస్తారు. ఇతర రోజుల్లో కంటే కార్తీకమాసంలో దీపారాధన చేయడం విశిష్టమైనదిగా భావిస్తారు. సంవత్సరానికి 365 రోజులు. ఈ ప్రకారం ఇంట్లోని ఒక్కొక్క వ్యక్తి పేరుమీద 365 వత్తులు వెలిగిస్తారు. ఆ విధంగా సంవత్సరం మొత్తం దైవపూజ చేసిన ఫలం లభిస్తుందని భావిస్తారు. ఈ క్రమంలో బుధవారం(నేడు) కార్తీక పౌర్ణమి సందర్భంగా వేయిస్తంభాల దేవాలయంలో సాయంత్రం లక్షదీపోత్సవం, భద్రకాళి దేవాలయంలో జ్వాలాతోరణం ఏర్పాటు చేశారు. అలాగే, పలు దేవాలయాల్లో దీపాలు వెలిగించుకోవడానికి ఏర్పాట్లు చేశారు.

నేడు వేయిస్తంభాల దేవాలయంలో వేడుకలు..

చారిత్రక వేయిస్తంభాలదేవాలయంలో బుధవారం నిర్వహించనున్న కార్తీకపౌర్ణమి వేడుకలకు ఏర్పా ట్లు పూర్తయ్యాయి. భక్తుల రద్దీని తట్టుకోవడానికి క్యూలైన్లు, దీపాలు వెలుగించుకోవడానికి మట్టిప్రమిదలు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం 4 గంటల నుంచి సుప్రభాతం, మూలగణపతికి పంచామృతాభిషేకం, రుద్రేశ్వరుడికి పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. అనంతరం రాత్రి 10గంటల వరకు భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించుకునేలా ఏర్పాటు చేసినట్లు దేవాలయ ఈఓ ధరణికోట అనిల్‌కుమార్‌, ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.

నేడు కార్తీక పౌర్ణమి, ఉసిరిక పున్నమి

దీపాలు, వత్తులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న భక్తులు

పలు ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

భక్తజనంతో కిటకిటలాడునున్న

శివాలయాలు

దీపావళి తర్వాత అదేస్థాయిలో జరుపుకునే పండుగ కార్తీకపౌర్ణమి. దీపావళి రోజున నోములు జరుపుకోవడం వీలుపడని వారు ఈరోజు నోముకుంటారు. ఈ క్రమంలో మంగళవారం నగరంలోని పలుకూడళ్ల వద్ద ఉసిరికొమ్మలు, కాయలు, నోము కుండలు, సాంబ్రాణి, పట్టు, నూలు నోము ధారాలు, దీపంతులు, వత్తులు, పూలు తదితర పూజాసామగ్రి అమ్మకాలు జోరుగా సాగాయి.

పూర్వం భూగోళం ఏవిధంగా ఉంటుందో చెప్పడానికి ఉసిరికాయను ఉపమానంగా చూపేవారు. భూమికి మరోపేరు ధాత్రి. అలాగే, ఉసిరికను కూడా ధాత్రి అనే పేరుతోనే పిలుస్తారు. కార్తీకమాసంలో విష్ణు సంబంధ దేవతావృక్షమైన ఉసిరిక చెట్టును పూజించడం సంప్రదాయం. ఉసిరికను భూగోళంగా భావిస్తారు. అందుకే ఉసిరికపై దీపాలు వెలిగించడం అంటే భూగోళంపై వెలుతురు నింపడమని భావిస్తారు. నీటిలో ఉసిరిక ఆకులు వేసి తెల్లవారుజామునే స్నానం ఆచరించి బిల్వదళాలతో శివపూజ, తులసీదళాలతో విష్ణుపూజ చేస్తారు.

కార్తీకదీపోత్సవం..

సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు లక్షదీపార్చన, లక్షవత్తుల పూజ వైభవంగా నిర్వహించనున్నామని ఈఓ తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో సాయంత్రం 5గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి , పేరిణి నృత్యాలు, భజనలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement