అనారోగ్య కారణాలతో నర్సింగ్ ఆఫీసర్ ఆత్మహత్య
భూపాలపల్లి అర్బన్ : అనారోగ్య కారణాలతో ఓ నర్సింగ్ ఆఫీసర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భూపాలపల్లి సీఐ నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం రంగాపూర్‌కు చెందిన ఇరుప అనిత (30) ఏడాదిన్నర నుంచి భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నర్సింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. మంజూర్‌నగర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. అనిత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున అద్దె ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేశ్ కుమార్ పేర్కొన్నారు.


