పాలకుర్తికి కార్తీక శోభ..
పాలకుర్తి టౌన్: పాలకుర్తికి కార్తీక శోభ వచ్చింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శబరిమల మకరజ్యోతి మాదిరిగానే క్షీరాద్రి శిఖరం పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో మంగళవారం అతిపెద్ద అఖండజ్యోతి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. తిరువన్నామలై అరుణాచలం స్ఫూర్తితో పాలకుర్తి క్షీరగిరి చుట్టూ గిరి ప్రదక్షిణ అనంతరం కొండపై ఏర్పాటు చేస్తున్న భారీ ప్రమిదలో టన్ను నువ్వుల నూనె, ఆవు నెయ్యి, 2 క్వింటాళ్ల ముద్ద కర్పూరంతో అతిపెద్ద అఖండజ్యోతిని వెలిగించనున్నారు. పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలో మూడో అఖండజ్యోతి నిర్వహిస్తోంది. 8 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా రూపొందించిన దీపభాండాన్ని పాలకుర్తి శిఖరాగ్రవేదికపై ఏర్పాటు చేశారు. వేలాదిగా తరలొచ్చే భక్తుల సమక్షంలో గిరిప్రదక్షిణ అనంతరం సాయంత్రం 6 గంటలకు అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఈ అఖండజ్యోతి పాలకుర్తి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు దర్శనమిస్తుంది. కాగా, 2013లో క్షీరగిరిపై అఖండ జ్యోతి దర్శనం ఏర్పాటును ప్రారంభించారు.
ముఖ్య అతిఽథులుగా
ఉత్తరకాశీ పీఠాధిపతి, ఎమ్మెల్యే
సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్శంగా అఖండ జ్యోతి దర్శనం ప్రారంభానికి ముఖ్యఅతిథిగా ఉత్తరకాశీ పీఠాఽధిపతి శ్రీరామానంద ప్రభుజీ, స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి హాజరు కానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు వేశారు.
నేడు క్షీరగిరిపై అఖండజ్యోతి
ముస్తాబైన సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం


