అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో రాణించాలి
నెల్లికుదురు: ప్రతీ ఆర్చరీ (విలువిద్య) క్రీడాకారుడు అంతర్జాతీయ పోటీల్లో రాణించి దేశానికి పేరు తీసుకురావాలని ఎంఈఓ రాందాస్, ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రటరీ గండి సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి 69వ ఎస్‌జీఫ్ ఆర్చరీ పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు, మెడల్స్‌తో పాటు సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్రీడల్లో ఎంపిక చేసిన క్రీడాకారులు మణిపూర్‌లో జరిగే జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి జ్యోతి, జోనల్ సెక్రటరీ ఎం.డి. ఇమామ్, మల్లయ్య, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు అయిలయ్య, ప్రణయ్, ప్రభాకర్, రవి తదితరులు పాల్గొన్నారు.
ఎంఈఓ రాందాస్, ఎస్‌జీఎఫ్
జిల్లా సెక్రటరీ గండి సత్యనారాయణ


