ఉత్సాహంగా ఖోఖో ఎంపిక పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ లష్కర్‌బజార్‌లోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్ మైదానంలో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–19 బాలబాలికల ఖోఖో ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీలకు 500 మంది క్రీడాకారులు హాజరైనట్లు ఎస్‌జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ తెలిపారు. ప్రతిభ ఆధారంగా త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా బాలబాలికల జట్లను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రాక్టీసింగ్ హైస్కూల్ హెచ్‌ఎం జగన్, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్‌రెడ్డి, కుమార్, ఖోఖో సంఘం జిల్లా కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్, పీడీలు కోట సతీశ్, బరుపాటి గోపి, డీఎస్‌ఏ ఖోఖో కోచ్ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.


