
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మరిపెడ: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. మరిపెడ మున్సిపాలిటీలోని పీహెచ్‌సీ, తహసీల్దార్ కార్యాలయం, జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య ఆరో గ్య, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకాధికారులు హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, శానిటేషన్‌పై దృష్టి పెట్టాలన్నా రు. వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ పరిశీలించాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రో త్సహించాలన్నారు. అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీ లించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమ య్యే రీతిలో భోధన చేయాలన్నారు. మెనూ ప్రకా రం భోజనం అందించాలన్నారు. తహసీల్దార్ కా ర్యాలయాన్ని తనిఖీ చేసి, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ కృష్ణవేణి ఉన్నారు.
ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలి
మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ అౖద్వైత్‌కుమార్‌సింగ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పు రోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు చిత్తశుద్ధితో పని చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలన్నారు. ఉచిత ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులు త్వరగా మార్కింగ్ చేసుకుని బేస్‌మెంట్ నిర్మాణం పూర్తయ్యేలా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. విపత్తుల నిర్వహణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
ఆధునిక సాంకేతికతపై యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లను సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఏటీసీకి సంబంధించిన ప్రచార పత్రాలను కలెక్టర్ ఆవి ష్కరించారు. ఏటీసీలో ఈ సంవత్సరం తరగతులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, కళాశాల ప్రిన్సిపాల్ బాబు, శిక్షణాధికారి ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.