
సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని ఏబీఎస్‌ఎఫ్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద సీఎం దిష్టిబొమ్మ దహనానికి గురువారం యత్నించారు. కేయూ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, సిబ్బంది అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏబీఎస్‌ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద నరేశ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఎస్‌ఎఫ్ నాయకులు విజయ్, నందు, విష్ణు, పీటర్, శ్రీకాంత్, పవన్, అరవింద్, నవీన్, తరుణ్, గణేశ్, వంశీ, గోవింద్, సమ్మయ్య, సూర్యసాయి తదితరులు పాల్గొన్నారు.