
స్కూళ్లలో ఎఫ్‌ఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్ షురూ
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా (పెద్దపల్లి మినహా) ప్రభుత్వ పాఠశాలల్లో బోధనచేసే టీచర్లకు ఫేషి యల్ అటెండెన్స్(ఎఫ్‌ఆర్‌ఎస్) నమోదు శుక్రవారం నుంచి ప్రారంభమైంది. రాష్ట్రంలో ఉమ్మడి వరంగ ల్ జిల్లాలోని ఆరు జిల్లాల ర్యాంకులు (శాతం) వి డుదల చేశారు. వరంగల్–8, హనుమకొండ–16, మహబూబాబాద్–26, జనగామ–27, ములుగు–29, భూపాలపల్లి–33వ స్థానంలో నిలిచాయి. మొబైల్ ఫోన్‌లో విద్యార్థితోపాటు ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బందికి సంబంధించి ఒకే లాగిన్‌లో వేర్వేరుగా అటెండెన్స్ తీసుకునే అవకాశం కల్పించారు. కొంతకాలంగా విద్యార్థులకు ఫేషియల్ అటెండెన్స్ విధానం కొనసాగుతుండగా.. కొత్తగా టీచర్లకు అమలు చేస్తున్నారు. ఉదయం 9.05 గంటలకు, సాయంత్రం 4.15 గంటల తర్వాత టీచర్లు, స్టాఫ్ ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. కాగా, అటెండెన్స్ తీసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ తర్వాత ఫొ టో అప్‌లోడ్ అయ్యేందు కు అరగంట సమ యం పట్టిందని పలువు రు ఉ పాధ్యాయులు తెలిపా రు. సాంకేతిక సమస్య ఇ లాగే కొనసాగితే అటెండె న్స్ కోసమే సమయం వృథా చేయాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాలో ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు వివరాలు..
జిల్లా పాఠశాలలు టీచర్లు మొదటిరోజు రిజిస్ట్రేషన్ శాతం ర్యాంకు
వరంగల్ 534 3,211 2,085 64.93 08
హనుమకొండ 472 2,987 1,883 63.04 16
మహబూబాబాద్ 768 3,859 2,231 57.81 26
జనగామ 459 2,773 1,572 56.69 27
ములుగు 337 1,557 832 53.44 29
జేఎస్.భూపాలపల్లి 414 1,927 901 46.76 33