నేడు సిల్వర్‌ మెడల్‌ స్వీకరించనున్న కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు సిల్వర్‌ మెడల్‌ స్వీకరించనున్న కలెక్టర్‌

Aug 2 2025 6:42 AM | Updated on Aug 2 2025 6:42 AM

నేడు

నేడు సిల్వర్‌ మెడల్‌ స్వీకరించనున్న కలెక్టర్‌

మహబూబాబాద్‌: జిలాలో పలు కార్యక్రమాలు వందశాతం పూర్తి చేసినందుకు కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌ శనివారం అవార్డు అందుకో నున్నారు. ఈమేరకు శుక్రవారం కలెక్టరేట్‌ అధి కారులు వివరాలు తెలిపారు. 2024 జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో నిర్వహించిన సంపూర్ణ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా మొదటి త్రైమాసికం ఏఎన్‌సీలో గర్భిణులు వందశాతం నమోదయ్యారు. అలాగే బ్లాక్‌లో డయాబెటిస్‌ పరీక్షలు వందశాతం నిర్వహించారు. అదేవిధంగా జిల్లాలోని గంగారం మండలం ఆరు పారామీటర్లతో ఉత్త మ ప్రతిభకనబర్చి ఐదు సంతృప్త సూచికలు సాధించినందుకు రాష్ట్రస్థాయిలో నీతి ఆయోగ్‌ కలెక్టర్‌కు సిల్వర్‌ మెడల్‌ ప్రకటించింది. ఈమేరకు నేడు హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.

బాలల హక్కులను కాపాడాలి

మహబూబాబాద్‌ రూరల్‌: బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ అన్నారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ విజయవంతం కావడంతో ఎస్పీ శుక్రవారం మాట్లాడారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ 11వ విడతలో జిల్లా వ్యాప్తంగా 40 మంది బాలబాలికలను గుర్తించామన్నారు. తెలంగాణ నుంచి 23 మంది బాలురు, ముగ్గురు బాలికలు, ఇతర రాష్ట్రాల నుంచి 13 మంది బాలురు, ఒక బాలిక ఉందన్నారు. 40 మందిలో ఆరుగురు బాలురు, ఒక బాలికను తల్లిదండ్రులకు అప్పగించామని, 30 మంది బాలురు, ముగ్గురు బాలికలను షెల్టర్‌ హోంలకు పంపించమన్నారు. జిల్లా వ్యాప్తంగా చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్న 20 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నట్లు తెలిస్తే వెంటనే డయల్‌ 100కి ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా బాల కార్మికులను వారి తల్లిదండ్రులకు అప్పగించిన ప్రత్యేక బృందాల సభ్యులను ఎస్పీ అభినందించారు.

విద్యార్థులపై

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలోని వసతి గృహాల్లోని విద్యార్థులపై ఉద్యోగులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి ఎం. నరసింహస్వామి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో శుక్రవారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వార్డెన్లు, నాలుగో తరగతి సిబ్బందికి వ్యక్తిగత పరిశుభ్రత, భోజనంపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహస్వామి మాట్లాడుతూ.. పిల్లలకు భోజనం తయారు చేయడంలో ఎలాంటి పొరపాట్లు చేయవద్దన్నారు. అనంతరం వైద్యుడు కొప్పు ప్రసాద్‌, మెడికల్‌ ఆఫీసర్‌ మౌనిక మాట్లాడుతూ.. సీజనల్‌ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని మరుగుదొడ్లు, విద్యార్థుల గదులు పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

కార్యాచరణ పక్కాగా

అమలు చేయాలి

తొర్రూరు: వందరోజుల కార్యాచరణను పక్కాగా అమలు చేయాలని సీడీఎంఏ జాయింట్‌ డైరెక్టర్‌ నారాయణరావు అన్నారు. స్థానిక మున్సిపాలిటీలో 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ తీరును శుక్రవారం పర్యవేక్షించారు. ప్లాస్టిక్‌ నియంత్రణ, పారిశుద్ధ్యం, హరితహారం తది తర అంశాలపై ఆరా తీశారు. అమృత్‌ పథ కం కింద నిర్మిస్తున్న నీటి ట్యాంకును పరిశీలించారు. కమిషనర్‌ వక్కల శ్యాంసుందర్‌తో కలిసి సీడీఎంఏ జాయింట్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ.. సీ జనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పను లు సక్రమంగా చేపట్టాలన్నారు. చెత్తను వేరు చేయడం, ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నర్సరీల్లోని మొక్కలు నాటేందుకు స్థలాలు ఎంచుకోవాలన్నారు. సెప్టెంబర్‌ 9వరకు 100 రోజుల కార్యాచరణ కొనసాగించాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. చెత్తను వేరు చేయడం, పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రజల కు అవగాహన కల్పించాలన్నారు. డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏఈ రంజిత్‌కుమార్‌, మేనేజర్‌ స్వామి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్‌ ఉన్నారు.

నేడు సిల్వర్‌ మెడల్‌  స్వీకరించనున్న కలెక్టర్‌1
1/1

నేడు సిల్వర్‌ మెడల్‌ స్వీకరించనున్న కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement