
ఆదాయం ఘనం..
శనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లోu
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. రైతులు అధికంగా సరుకులు తీసుకొస్తే స్థలం సరిపోవడం లేదు. దీంతో ఆలస్యంగా వచ్చిన వాహనాలను మార్కెట్ బయటనే ఉంచి, మరుసటి రోజు లోనికి అనుమతిస్తున్నారు. ఆదాయం ఉన్నప్పటికీ.. వసతులు కల్పన, అభివృద్ధి లేకపోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సరుకులు అధికంగా వస్తే అంతే సంగతులు..
దశాబ్దాల క్రితం 9.30 ఎకరాల స్థలంలో మార్కెట్ నిర్మాణం చేపట్టారు. కాగా గత వార్షిక సంవత్సరంలో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు కలిపి 6,96,373 బస్తాల క్రయవిక్రయాలు జరిగాయి. 5వేల బస్తాల నిల్వ సామర్థ్యం కలిగిన మార్కెట్ యార్డులో సీజన్ సమయంలో 25 వేల బస్తాల నుంచి 30 వేల బస్తాల వరకు వస్తుంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణం సరిపోకపోవడంతో సరుకులు అధికంగా వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నా యి. చిన్నపాటి వర్షం వస్తే కూడా రైతులు తమ సరుకులను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. కాగా ప్రభుత్వం 25 నుంచి 30 ఎకరాల భూమిని కేటాయిస్తే వ్యవసాయ మార్కెట్ కా ర్యకలాపాలు సాఫీగా సాగుతాయి.
లక్ష్యానికి మించి ఆదాయం..
వ్యవసాయ మార్కెట్ పరిధిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి మించి ఆదాయం సమకూరుతోంది. గత వార్షిక సంవత్సరానికి సంబంధించి రూ.7.94 కోట్లు లక్ష్యం కాగా రూ.8.65 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. ఏటా ఇదే విధంగా అధిక ఆ దాయం వస్తున్నప్పటికీ అభివృద్ధి పనుల్లో మాత్రం వెనకడుగు వేస్తున్నారు.
సిబ్బంది కొరతతో ఇబ్బందులు..
వ్యవసాయ మార్కెట్‌లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. మొత్తం 14 పోస్టులకుగాను ప్రస్తుతం సెక్రటరీ, సూపర్ వైజర్, ఇద్దరు ఏఎంఎస్ పనిచేస్తుండగా ఐదు అటెండర్, టైపిస్టు, ఏఎంఎస్, ఎల్‌డీసీ, అసిస్టెంట్ సెక్రటరీ, వాచ్‌మెన్ పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. 25మంది సెక్యూరిటీ గార్డులు అవసరం ఉండగా ప్రస్తుతం ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఆరుగురు మహిళలు, 12 మంది పురుషులు విధులు నిర్వహిస్తుండగా.. ఏడు సెక్యూరిటీగార్డు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మార్కెట్‌లో క్రయవిక్రయాలన్నీ ఇ–నామ్ పద్ధతిలో కొనసాగుతుండగా ఆన్‌లైన్ తక్ పట్టీలు, పేమెంట్ ఇంటిగ్రేషన్ పనులను ఇద్దరు డీఈఓలు మాత్రమే చేపడుతుండగా.. డాటా ఎంట్రీ ఆపరేటర్ల కొరత వేధిస్తోంది.
ట్రెజరీలో రూ.12 కోట్ల నిల్వ..
వ్యవసాయ మార్కెట్ ట్రెజరీలో రూ.12 కోట్ల మేరకు నిల్వ ఉన్నట్లు సమాచారం. ఆ డబ్బులతోనైనా మార్కెట్ ప్రాంగణంలో మౌలిక వసతులు, అభివృద్ధి పనులను చేపట్టాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ మార్కెట్‌కు అనుసంధానంగా రెండువైపులా 18 షాపింగ్ కాంప్లెక్స్ షెటర్లు ఉండగా వాటిల్లో వ్యాపారస్తులు తక్కువ మంది మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మిగతా షెటర్లన్నీ కూడా అద్దెకు ఇచ్చినప్పటికీ అవి కూడా అరకొర అద్దెలతో నిర్వహణ కొనసాగుతోంది. వాటికి టెండర్లు ఖరారు చేయడంలో సంబంధిత పాలకమండలి, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
శిఽథిలావస్థకు చేరిన ఏఎంసీ కార్యాలయ భవనం
న్యూస్‌రీల్
మానుకోట వ్యవసాయ మార్కెట్‌లో
సమస్యల తిష్ట
అధికంగా సరుకులు వస్తే సరిపోని స్థలం
శిథిలావస్థలో కార్యాలయాల భవనాలు
వసతులు లేక రైతన్నల ఇబ్బందులు
శిఽథిలావస్థలో భవనాలు..
వ్యవసాయ మార్కెట్ కార్యకలాపాలు నిర్వహించే భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో ఆ భవనం పక్కనే ఉన్న మార్కెట్ షాపింగ్ కాంప్లెక్ భవనంలో వ్యవసాయ మార్కెట్ పాలక వర్గం, అధికారులు, సిబ్బంది తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఈ మేరకు శిథిలావస్థ భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించాల్సి ఉంది. అలాగే రైతుల అవసరాల నిమిత్తం మరో నూతన కవర్ షెడ్డు నిర్మించాల్సి ఉంది. రెండు విశ్రాంతి భవనాలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో రైతులు, హమాలీలు, దడవాయిలకు నిలువ నీడ కరువైంది.

ఆదాయం ఘనం..

ఆదాయం ఘనం..

ఆదాయం ఘనం..