
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
దంతాలపల్లి: రైతులు పత్తి పంటలో సస్యరక్షణ చర్యలు చేపడితేనే అధిక దిగుబడులు సాధిస్తారని డీఏఓ శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని ఆగపేట గ్రామంలో బుధవారం పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తి పంటలో రసం పీల్చే పురుగుల వల్ల పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందని, రైతులు గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మొక్క దశ నుంచి రైతులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు మండల వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఓ వాహిని, టెక్నికల్ ఏఓలు శ్రీదేవి, రాజు, ఏఈఓలు దీక్షిత్, ఉదయ్‌కిరణ్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
ధరల పట్టిక బోర్డులు ఏర్పాటు చేయాలి
నెల్లికుదురు: ఎరువుల షాపుల ఎదుట ఎరువుల నిల్వలు, ధరల పట్టిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఏడీఓ శ్రీనివాసరావు ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని ఎరువుల షాపులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను ఏఓ షేక్ యాస్మిన్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎమ్మార్పీకే ఎరువులు విక్రయించాలన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.